క్యాన్సర్ పేషెంట్లకు వ్యాక్సిన్ సురక్షితం..! కొత్త పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి..
Cancer Patients: కరోనా థర్డ్ వేవ్ వల్ల ప్రపంచంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ప్రజలందరు టీకా తీసుకునేలా అందరు ప్రోత్సహిస్తున్నారు.

Cancer Patients: కరోనా థర్డ్ వేవ్ వల్ల ప్రపంచంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ప్రజలందరు టీకా తీసుకునేలా అందరు ప్రోత్సహిస్తున్నారు. మొదట్లో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్‌కి దూరంగా ఉండాలని సూచించారు. తర్వాత18 ఏళ్లు పైబడిన వారందరు టీకా తీసుకోవాలని ప్రకటించారు.తాజాగా కొత్త పరిశోధనలో క్యాన్సర్ రోగులు కూడా టీకా సురక్షితమని పరిశోధకులు తేల్చారు. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు.
యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ (ESMO) వార్షిక సమావేశంలో ‘బూస్టర్’ డోస్ క్యాన్సర్ రోగులలో భద్రతా స్థాయిని మరింత పెంచుతుందని సూచిస్తున్నాయి. రెండు డోసులు వేసుకున్నా కూడా కొంతమంది వ్యక్తులలో ప్రతిరోధకాలు తగ్గుతున్నాయి. అందుకే సాధారణ ప్రజలకు కూడా బూస్టర్ డోస్ అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్యాన్సర్ రోగులు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనలేదు. ఎందుకంటే అప్పటికే వారు పేషెంట్లుగా ఉన్నారు కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని వారిని దూరంగా ఉంచారు.
తాజా పరిశోధన ఫలితాలలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇమ్యునోథెరపీతో చికిత్స పొందిన క్యాన్సర్ రోగులు, కీమోథెరపీతో చికిత్స పొందిన రోగులు, కీమో-ఇమ్యునోథెరపీ చికిత్స పొందిన రోగులు ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. రెండో డోసు తర్వాత 28 రోజులలో కీమోథెరపీ పొందుతున్న వారిలో 84 శాతం, కీమో-ఇమ్యునోథెరపీ పొందిన 89 శాతం, ఇమ్యునోథెరపీ పొందిన వారిలో 93 శాతం మంది రోగులలో యాంటీబాడీస్ కనుగొన్నారు.