ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా ? అయితే ప్రమాదమే.. గ్రీన్ టీ ఎప్పుడు, ఎంత తాగితే ప్రయోజనం ఉంటుందో తెలుసా..
ప్రస్తుతం చాలా మంది గ్రీన్ టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం బరువు తగ్గడం. గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని..
ప్రస్తుతం చాలా మంది గ్రీన్ టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం బరువు తగ్గడం. గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని.. ఫిట్‌గా ఉంటారని.. అలాగే ఆరోగ్యంగా ఉండొచ్చని గ్రీన్ టీ తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీని కనీసం ప్రాసెస్ చేయకుండా తయారు చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరవు. కొందరు రోజులో ఒక కప్పు మాత్రమే గ్రీన్ టీ తాగుతారు. అలాగే మరికొందరు రోజుకు ఐదు కప్పులకు మించి తాగుతారు. అయితే రోజులో గ్రీన్ టీ ఎంత తాగాలి. ఎప్పుడు తాగాలి.. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా.
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ లిటరేచర్ రివ్యూ ప్రకారం కిణ్వ ప్రక్రియను నివారించడానికి నేరుగా పంటనుంచి ఆకులను సేకరిస్తారు. ఆ తర్వాత వాటిని పొడిగా మారుస్తారు. స్టీమింగ్ రంగు మారే ఎంజైమ్స్ నాశనం చేస్తుంది. దీంతో గ్రీన్ టీ రోలింగ్.. ఎండబెట్టడం వలన వాటి రంగు మారుతుంది.
గ్రీన్ టీ ఎంత తాగాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్, కెఫిన్ పుష్కలంగా ఉంటాయి. ఒకరోజులో 3 కప్పుల కంటే ఎక్కువగా టీ తాగితే.. రాత్రిళ్లు నిద్రపై ప్రభావం పడుతుంది. అలాగే మూత్రవిసర్జనలో కూడా సమస్యలు ఏర్పడతాయి. దీంతో శరీరంలోని అనేక పోషకాలు బయటకు వెళ్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం చాలా ప్రమాదకరం. గ్రీన్ టీని పగటి పూట, సాయంత్రం మాత్రమే తాగాలి. అలాగే భోజనానికి 2 గంటల ముందు లేదా ఆ తర్వాత తాగవచ్చు. భోజనం మధ్యలో గ్రీన్ టీ తాగడం వలన పోషకాలు తీసుకోవడం తగ్గుతుంది. అలాగే ఆహారంలో ఐరన్, ఖనిజాల శోషణకు ఆటంకం కలుగుతుంది. ఒక రోజులో ఒకటి లేదా రెండు కప్పుల టీ మాత్రమే తాగాలి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) ఉన్న వ్యక్తులు గ్రీన్ టీ అస్సలు తాగొద్దు.
గ్రీన్ టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు.. 1. గ్రీన్ టీ తాగడం వలన ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు, నోరు, కడుపు, మూత్ర పిండాలు, క్లోమం, జ్ఞాపకశక్తి , క్యాన్సర్ వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే జీవక్రియ రేటు పెరుగుతుంది. బరువు తగ్గుతారు. 2. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడే యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. 3. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్ట్రోక్, అతిసారం వంటి జీవక్రియ వ్యాధులను తగ్గిస్తుంది.
Heart Attack: హార్ట్ ఎటాక్ నివారించడానికి 4 మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..