Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పదార్థాలు తిన్నాక పాలు పొరపాటున కూడా తాగొద్దు.. ఒకవేళ తాగితే ఈ సమస్యలు తప్పవు.. అవెంటో తెలుసుకొండి..

సాధారణంగా పాలు ఆరోగ్యానికి మంచివే అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలకు పాలు బలం అంటుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్,

ఈ పదార్థాలు తిన్నాక పాలు పొరపాటున కూడా తాగొద్దు.. ఒకవేళ తాగితే ఈ సమస్యలు తప్పవు.. అవెంటో తెలుసుకొండి..
Milk
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 21, 2021 | 7:19 PM

సాధారణంగా పాలు ఆరోగ్యానికి మంచివే అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలకు పాలు బలం అంటుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజాలు, మాంసకృత్తులు, మంచి కొవ్వులు, ఆమైనో ఆమ్లాలు, కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, లాక్టోస్ వంటి పోషకాలు అనేకం ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో పాలు తాగాలని సూచించబడింది. అయితే పాలు తాగడానికి ముందు.. లేదా తాగిన తర్వాత ఎలాంటి పదార్థాలను తీసుకోవద్దు. కానీ చాలా మంది పాలతోపాటు.. బ్రెడ్, అరటి పండు తీసుకుంటుంటారు. ఆయుర్వేదం ప్రకారం ఇలా తీసుకోవడం మంచిది కాదు. కొన్ని ఆహార పదార్థలను పాలతో కలిపి అస్సలు తీసుకోవద్దు. పాలతో కలిపి కొన్ని పదార్థాలను తీసుకుంటే.. శరీరంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మరి ఆ పదార్థాలు ఎంటో తెలుసుకుందామా.

1. పాలు, పెరుగు రెండింటితోనూ చేపలు తీసుకోవద్దు. ఒకవేళ కలిపి తీసుకుంటే కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్, తెల్లని మచ్చలు వంటి సమస్యలు కలుగుతాయి. 2. అలాగే చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో బ్రెడ్ బటర్.. పాలు తీసుకుంటారు. కానీ పాలతో కలిపి బ్రెడ్, వెన్న తీసుకోవడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్స్, కార్పోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలను కలిపి అస్సలు తీసుకోవద్దు. ఇలా తినడం వలన కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అయితే వెన్న చాలా ఉప్పగా ఉంటుంది. పాలతో ఉప్పగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన దురద, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వేయించిన పదార్థాలు.. ఉప్పగా ఉండేవాటిని పాలతో కలిపి తీసుకోవద్దు. 3. పెరుగు, పాలు కలిపి తీసుకుంటారు చాలా మంది. అయితే పెరుగును పాలతోనే చేస్తారు. వీటిని కలిపి ఎప్పుడూ తీసుకోవద్దు. ఇది అసిడిటి, గ్యాస్, వాంతింగ్స్ వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. పెరుగు తిన్న దాదాపు గంట తర్వాత పాలు తాగొచ్చు. 4. ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగవద్దు. ముల్లంగి, పాల మధ్య దాదాపు 8 గంటల గ్యాప్ ఉండాలి. ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం వలన చర్మ సమస్యలు వస్తాయి. అలాగే పండ్లు, బెర్రీలు, నిమ్మ, నారింజ, గూస్ బెర్రీ, సిట్రస్ పండ్లు, తీసుకుంటే జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. కడుపు నొప్పి కూడా కలుగుతుంది. 5. మినప్పప్పు కూడా పాలతో కలిపి తీసుకోవద్దు. వీటి రెండింటి మధ్య ఎక్కువ గంటలు గ్యాప్ ఉండాలి. ఒకవేళ కలిపి తింటే మీ కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. దీంతో గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు కలుగుతాయి.

Also Read: Shekar Kammula: శేఖర్ కమ్ముల ముందుగా నన్ను వద్దన్నారు.. ఆసక్తికర విషయాలను షేర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్..

Payal Ghosh: నాపై యాసిడ్‎తో.. ఇనుప రాడ్లతో దాడి చేశారు.. హీరోయిన్ పాయల్ సంచలన వ్యాఖ్యలు..