మనస్సు బాగోలేనప్పుడు ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలట.. వెంటనే రిలాక్స్ అవుతారు..
సాధారణంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగ రోజంతా ఉత్సాహంగా ఉండడం అనేది..
సాధారణంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగ రోజంతా ఉత్సాహంగా ఉండడం అనేది… తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. అలాగే మానసిక స్థితిపైన ఆహారం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మన మనోభావాలు.. మానసిక స్థితి మెరుగ్గా ఉండటానికి ఆహారం ప్రధాన పాత్రల పోషిస్తుందని తెలిపారు. .. మనం సంతోషంగా… విచారంగా ఉన్నా.. కోపంగా ఉన్నా.. ఆత్రుతగా.. నిస్పృహాలో ఉన్నా సమయంలో మెదడు పనితీరుపై కొందరు అధ్యాయనం నిర్వహించారు. ఈ క్రమంలో మన మానసిక స్థితి.. మనస్సు.. సరిగ్గా లేని సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిదని.. డైటీషియన్ డాక్టర్ జ్యోతి తెలిపారు. అవెంటో తెలుసుకుందామా.. 1. డార్క్ చాక్లెట్.. కోకో అంటే చాక్లెట్ బీన్స్‌లో టిఫ్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని మన మెదడు సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెరోటోనిన్ అనేది మన మానసిక స్థితిని మెరుగ్గా ఉంచడంలో సహాయపడే ఒక ప్రధాన హార్మోన్ అన్నమాట. 2. గ్రీన్ టీలో క్యాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి.. కడుపులో మంట తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగ మెదడు పనితీరు ప్రోత్సహించడంలో సహయపడుతుంది. అలాగే ఇందులో కెఫిన్ ఉన్నందున్న మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 3. క్యాప్సికం..ఇందులో విటమిన్ ఏ, b6 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సెరోటోనిన్ , నోర్ పైన్ వంటి హార్మోన్లను తయారు చేయడంలో సహయపడుతుంది. ఈ హర్మోన్.. మెదడు చురుగ్గా ఉంచుతుంది. 4. అలాగే ఒమేగా 3 అధికంగా ఉండే ఆహార పదార్థాలు కూడా గుండె జబ్బులను నియంత్రించడంలో సహయపడతాయి. అలాగే ఇవి బరువును తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి డిప్రెషన్, ఇతర మానసిక, ప్రవర్తనా పరిస్థితులను కూడా తగ్గిస్తుంది. సాల్మన్ చేపలు… అవిసెగింజలు, చియా గింజలు ఎక్కువగా తీసుకోవాలి. 5. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వలన ప్రేగులకు మంచిది. దీనివలన జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇడ్లీ, దోసె, బ్రెడ్, ఢోక్లా, పెరుగు, ఊరగాయ, కంజి, మిసో, పెరుగు, బియ్యం, అంబలి, అఖోని, టెంప్, కేఫీర్, కిమ్చి, వంటి పదార్థాలు మానసిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. 6. జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పిస్తా మొదలైన వాటిలో విటమిన్లు, ఖనిజాలు, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలో మెగ్నీషియం స్థాయి తగ్గితే అది డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. 7. ఆకుపచ్చ ఆకుకూరలు.. పాలకూర, మెంతికూరలో బి విటమిన్, ఫోలేట్ అధికంగా ఉంటుంది. దీని లోపం సెరోటోనిన్, డోపామైన్, నోరాడ్రినలిన్ (మానసిక స్థితికి ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్) జీవక్రియలో మార్పులు జరుగుతాయి. మానిసక ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి ఫోలేట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది.
Also Read: Tamannaah: ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న మిల్కీబ్యూటీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన తమన్నా..
Janhvi Kapoor: తగ్గేదే లే అంటున్న జాన్వీ కపూర్ అందాలు.. మీరు ఓ లుక్ వేయండి..