Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న మిల్కీబ్యూటీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన తమన్నా..

ప్రస్తుతం టాలీవుడ్‏లో మిల్కీ బ్యూటీ తమన్నా హావా కొనసాగుతుంది. ఇటు వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై.. డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ

Tamannaah: ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న మిల్కీబ్యూటీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన తమన్నా..
Tamanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 21, 2021 | 4:29 PM

ప్రస్తుతం టాలీవుడ్‏లో మిల్కీ బ్యూటీ తమన్నా హావా కొనసాగుతుంది. ఇటు వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై.. డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు.. ఇటీవల విలన్ పాత్రలోనూ పూర్తిగా నెగిటివ్ షెడ్‏లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పుడూ కేవలం హీరోయిన్‏గా కనిపించిన తమన్నా.. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ట్రో సినిమా ప్రతి నాయిక పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో మిల్కీబ్యూటీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తనకున్న ఆరోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా.. తనకున్న ఆరోగ్య సమస్య గురించి పరోక్షంగా స్పంధించింది. తమన్నా మాట్లాడుతూ.. నాకు మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కానీ ఎక్కువగా వర్కవుట్స్ చేయడం వలన ఎక్కువ మొత్తంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో నాకు ఓ ఆరోగ్య సమస్య వచ్చింది. ఈ విషయాన్ని నేను బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రస్తుతం సేంద్రీయ ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే నిపుణుల సలహాతో వ్యాయమాలు చేస్తున్నాను.. అలాగే ప్రై చేసిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా మానుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. అలాగే.. తరచూ తను నోని లేదా తొగరి ఫలం జ్యూస్ మాత్రమే తీసుకుంటుందట. అలాగే రెగ్యూలర్ ఆహార పదార్థాలల్లో ఆమ్లా జ్యూస్… పసుపు, కీర జ్యూస్, బాదంపాలు, కొబ్బరి నీళ్లు ఉండేలా చూసుకుంటాను అని తెలిపింది. ఇక ఫిట్‎గా, స్లిమ్‏గా ఉండేందుకు కేవలం ద్రవపదార్థాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది.అలాగే తన కెరీర్ మొదటి నుంచి సరైన డైటీషియన్‏ను నియమించుకోకపోవడమే.. తను చేసిన పెద్ద తప్పు అని.. ఇలా తన ఆరోగ్య సమస్యను చెప్పకోవాల్సి వచ్చిందని తమన్నా చెప్పుకొచ్చింది.

Also Read: Nivetha Pethuraj: నాచురల్ బ్యూటీతో ఫాన్స్ ని ఆకట్టుకుంటున్న నివేథా పేతురాజ్ లేటెస్ట్ పిక్స్..