Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Ghosh: నాపై యాసిడ్‎తో.. ఇనుప రాడ్లతో దాడి చేశారు.. హీరోయిన్ పాయల్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల సినీ పరిశ్రమలోని లేడీ యాక్టర్స్.. మీటూ.. క్యాస్టింగ్ కౌచ్ పై బహిరంగంగా కామెంట్స్ చేస్తూ.. తమ జీవితంలో జరిగిన అనుభవాలను

Payal Ghosh: నాపై యాసిడ్‎తో.. ఇనుప రాడ్లతో దాడి చేశారు.. హీరోయిన్ పాయల్ సంచలన వ్యాఖ్యలు..
Payal Ghosh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 21, 2021 | 6:32 PM

ఇటీవల సినీ పరిశ్రమలోని లేడీ యాక్టర్స్.. మీటూ.. క్యాస్టింగ్ కౌచ్ పై బహిరంగంగా కామెంట్స్ చేస్తూ.. తమ జీవితంలో జరిగిన అనుభవాలను షేరు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‏కు చెందిన పలువురు నటీమణులు తమకు ఎదురైన సంఘటనల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్‏పై తాజాగా యాసిడ్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన కొందరు తనపై యాసిడ్, ఇనుపరాడ్లతో దాడి చేసినట్లుగా పాయల్ తెలిపింది. ముంబైలోని ఓ మెడికల్ షాపులతో మందుకు తీసుకుని కారులో కూర్చుంటున్న సమయంలో తనపై దాడి చేశారని పాయల్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను చెబుతూ.. తన ఇన్‏స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.

ఆ వీడియోలో పాయల్ మాట్లాడుతూ.. మెడిసిన్స్ తెచ్చుకోవడానికి నిన్న బయటకు వెళ్లాను. ఆ తర్వాత నా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుండగా.. కొందు నాపై దాడికి యత్నించారు. వారి చేతిలో గ్లా్స్ బాటిల్ కూడా ఉంది. అది ఏంటో నాకు పూర్తిగా తెలియదు. కానీ.. అందులో యాసిడ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే వాళ్లు నన్ను ఇనుప రాడ్లతో కొట్టేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. గట్టిగా కేకలు వేశాను. దీంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో వారు తీసుకువచ్చిన ఇనుప రాడ్డు నా ఎడమ చేతికి తగిలి గాయమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా.. నా జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ముంబైలో తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోన్నా.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కంగారుగా ఉంది.. అలాగే.. నొప్పి వలన నేను రాత్రింతా నిద్రపోలేదని పాయల్ చెప్పుకొచ్చింది. అయితే ఈ దాడి ఎవరో తెలిసిన వాళ్లే ప్లాన్ ప్రకారం చేశారని అనుమానం వ్యక్తం చేసింది పాయల్.. ఇక తెలుగులో ప్రయాణం సినిమాతో హీరోయిన్‏గా పరిచయమైంది పాయల్. ఆ తర్వాత ఉసరవెళ్లి సినిమాలో సహయనటిగా నటించింది.

ఇన్‏స్టా పోస్ట్…

Also Read: Bigg Boss 5 Telugu: లహరి విషయంలో యాంకర్ రవిని ఏకిపారేస్తున్న నెటిజన్స్.. వీడియోతో అసలు విషయం బట్టబయలు..