Bigg Boss 5 Telugu: లహరి విషయంలో యాంకర్ రవిని ఏకిపారేస్తున్న నెటిజన్స్.. వీడియోతో అసలు విషయం బట్టబయలు..

బిగ్‏బాస్ నిన్నటి నామినేషన్ ఎపిసోడ్‏లో జరిగిన రచ్చ గురించి తెలిసిన విషయమే. నటి ప్రియ.. లహరిని నామినేట్ చేస్తూ..సంచలన వ్యాఖ్యలు చేసింది

Bigg Boss 5 Telugu: లహరి విషయంలో యాంకర్ రవిని ఏకిపారేస్తున్న నెటిజన్స్..  వీడియోతో అసలు విషయం బట్టబయలు..
Bigg Boss

బిగ్‏బాస్ నిన్నటి నామినేషన్ ఎపిసోడ్‏లో జరిగిన రచ్చ గురించి తెలిసిన విషయమే. నటి ప్రియ.. లహరిని నామినేట్ చేస్తూ..సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియా ఎప్పుడూ అబ్బాయిలతోనే ఉంటూ బిజీగా ఉంటుందని.. అర్థరాత్రిళ్లు.. యాంకర్ రవి, లహరి హగ్ చేసుకుంటూ కనిపించారని కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో లహరి, రవి.. రాంగ్ స్టేట్‏మెంట్స్ ఇస్తున్నారని.. కేవలం హగ్ మాత్రమే చేసుకున్నామని.. మరే ఉద్దేశం లేదని ప్రియతో గొడవకు దిగారు. అలాగే ఇంట్లోని కంటెస్టెంట్స్ అందరూ ప్రియ మాటలను తప్పుబట్టారు. దీంతో ప్రియ చేసిన వ్యాఖ్యలతో.. నిన్నటి నామినేషన్స్ ప్రక్రియ అర్థాంతరంగా ముగిసింది. అటు ప్రియ… ఇటు లహరి ఇద్దరూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత వారిద్దరికీ ప్రియా సారీ చెప్పినప్పటికీ ఈ గొడవ మాత్రం సద్దుమణగలేదు.

ఇక ప్రియ చేసిన వ్యాఖ్యలతో..హౌస్‏లోనే కాకుండా.. బయట కూడా ఆమెపై నెగిటివి పెరిగిపోయింది. ఇక నిన్నటి ఇష్యూలో లహరి ఎమోషనల్ అవుతూ.. తను రవిని బ్రదర్ అని పిలుస్తా అని.. మా ఇద్దరి మధ్య వేరే ఉద్ధేశ్యం లేదని వాదించగా.. ఇలాంటి మాటలు తన కూతురు వింటే.. ఏం అనుకుంటుంది అంటూ ఆవేశంతో ఊగిపోయాడు యాంకర్ రవి. ఇక ఇవాళ విడుదలైన ప్రోమోలో మరోసారి ప్రియా.. లహరి, రవిలు.. నిన్నటి గొడవ గురించి మాట్లాడుకున్నారు. తాజా వీడియోలో లహరి రవి దగ్గరకు వచ్చి.. నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నా.. అందుకే నీ హెల్ప్ కోసం నీ వెంట పడుతున్నా.. ఇంట్లో పెళ్లి కాని వాళ్లు చాలా మంది ఉన్నప్పటికీ లహరి నా వెనకే పడుతుంది.. ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అని ప్రియగారితో చెప్పారట.. నిజమా ? అంటూ రవిని ప్రశ్నించింది. దీంతో ప్రియ దగ్గరకు వచ్చిన రవి.. అక్కా నేను ఆ మాట అనలేదు. సింగిల్ మెన్ అనే మాట నా నోటి నుంచి రాలేదక్క.. పెళ్లి అయినవాళ్లు.. పెళ్లి కాని వాళ్లు అనే మాట వాడలేదక్కా.. అంటూ చెప్పడం కనిపిస్తోంది. దీంతో ప్రియ ఏడుస్తూ.. నువ్వు అన్నావ్ బ్రో.. ఆ మాట అన్నావ్ అని తెగేసి చెప్పింది. ఇక ఆ తర్వాత లహరితో కలిసి తింటూ.. ఆమె నన్ను కావాలనే బ్యాడ్ చేస్తుంది.. అని చెప్పగా.. ప్రియ ఒంటరిగా కూర్చోని ఏడుస్తూ కనిపించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా రవి.. ప్రియతో లహరి గురించి మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో లహరి తన వెంటపడుతుందని.. సీజన్ తర్వాత యాంకర్‏గా ట్రై చేస్తుందని.. అందుకే నా హెల్ప్ కోసం వెంటపడుతుందని.. ఇంట్లో పెళ్లికాని వాళ్లు ఉన్నప్పటికీ నాతోనే ఉంటుంది.. కలసి తింటున్నాం… బ్యాటరీస్ మార్చుకుంటున్నాం. నేను చెప్పలేకపోతున్నా.. అని ప్రియకు చెబుతూ కనిపించాడు రవి. ఇలాంటివి చెప్పలేం.. కానీ.. లిమిట్స్ క్రాస్ అయితే చెప్పగలం అంటూ ప్రియ చెప్పింది. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రవిని ఏకిపారేస్తున్నారు నెటిజన్స్.. అప్పుడు ఒకలా మాట్లాడి.. మళ్లి మాట మార్చాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రవి.. ప్రియ.. లహరిల మధ్య ఏర్పడిన ఈ గొడవ గురించి నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి.

Also Read: Tamannaah: ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న మిల్కీబ్యూటీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన తమన్నా..

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu