AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో‎

దీపికా పదుకొనే జీవితంలో ఒక సాధారణ రోజు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ? అయితే ఇక్కడ కొన్ని ఫొటోలు, వీడియోలు ఉన్నాయి చూడండి.

PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో‎
Pv Sindhu Deepika Padukone
Venkata Chari
|

Updated on: Sep 21, 2021 | 10:48 PM

Share

PV Sindhu-Deepika Padukone: దీపికా పదుకొనే జీవితంలో ఒక సాధారణ రోజు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ? అయితే ఇక్కడ కొన్ని ఫొటోలు ఉన్నాయి చూడండి. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి ఒంట్లోని కేలరీలను కరిగించేందుకు సరదాగా బ్యాట్మింటన్‌ ఆడారు. ఈమేరకు కొన్ని ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. సరదాగా మ్యాచ్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోగానే అవికాస్త వైరల్‌గా మారాయి. కేవలం కేలరీలను కరిగించడానికే బ్యాడ్మింటన్ ఆడినట్లు ఈ స్టార్‌లు చెప్పుకొచ్చారు.

“నా జీవితంలో ఒక సాధారణ రోజు.. పీవీ సింధుతో నా కేలరీలు కరిగించేందుకు సరదాగా మ్యాచ్ ఆడా” అంటూ దీపిక పోస్ట్‌కి క్యాప్షన్ అందించింది.

బాలీవుడ్ స్టార్ కోర్టులో తన కదలికలను చూపుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ బ్యాడ్మింటన్ ప్లేయర్‌లలో ఒకరైన సింధుతో మ్యాచ్ ఆడడం ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. పీవీ సింధు తన తాజా పోస్ట్‌లో దీపికను ఆటపట్టించడం కూడా కనిపించింది. “ఎన్ని కేలరీల కరిగించావ్?” అంటూ సింధు దీపికను ఆటపట్టించిన వీడియోను కూడా పంచుకున్నారు.

గాయపడిన ఎమోజీని పంచుకుంటూ, ‘దీపికా, కేలరీలను మర్చిపో! నా శరీరం చాలా బాధగా ఉంది!” అంటూ పీవీ సింధు ఫొటోలను పంచుకుంది. దీపిక పదుకొనే, పీవీ సింధు ఇటీవల రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఓ విందు చేసిన సందర్భంలో వార్తల్లో నిలిచారు. స్పోర్ట్స్ స్టార్‌తో సంతోషకరమైన సెల్ఫీని పంచుకుంటూ, రణవీర్ దానికి “స్మాషింగ్ టైమ్!” అంటూ క్యాప్షన్ అందించాడు.

రణవీర్ పంచుకున్న ఫొటోలకు సింధు లవ్ సింబల్‌తో కామెంట్ చేసింది. త్వరలో వీరిని మళ్లీ కలవాలంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది. అదే సెల్ఫీని తన పేజీలో పంచుకుంటూ.. ‎”మా ముఖాల్లో చిరునవ్వులు.. ఎంత సరదాగా గడిపామో చూపిస్తుంది” అని రాసుకొచ్చింది.

Also Read: Yuvraj Singh: ఆరు బంతులకు ఆరు సిక్సులు.. ఆ అద్భత ఘట్టాన్ని మళ్లీ కళ్లకు కట్టినట్లు చూపిన యూవీ. వైరల్‌ వీడియో..

Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్‌ పట్టనున్న మాజీ లెజెండ్స్‌..(వీడియో)