Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న మాజీ లెజెండ్స్..(వీడియో)
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. మాజీ స్టార్ క్రికెటర్స్ మళ్ళీ బ్యాట్ ఝళిపించబోతున్నారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దిగ్గజ ఆటగాళ్ల ఆటను మరోసారి చూసే అవకాశం వచ్చింది.. రెడీగా ఉండండి. త్వరలో యూఏఈలో ఒక స్పెషల్ లీగ్ నిర్వహించబోతున్నారు. ..
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. మాజీ స్టార్ క్రికెటర్స్ మళ్ళీ బ్యాట్ ఝళిపించబోతున్నారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దిగ్గజ ఆటగాళ్ల ఆటను మరోసారి చూసే అవకాశం వచ్చింది.. రెడీగా ఉండండి. త్వరలో యూఏఈలో ఒక స్పెషల్ లీగ్ నిర్వహించబోతున్నారు. ఇందులో ఇండియాతోపాటు మరికొన్ని దేశాల మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు ఆడబోతున్నారు. ఈ ప్రత్యేక లీగ్ యూఏఈలో వచ్చే ఏడాది మార్చిలో ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’ పేరుతో నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుందని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు.
అయితే ఈ టోర్నమెంట్ కోసం సంతకం చేసిన ఆటగాళ్ల పేర్లను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. అయితే, ఇందులో భారతదేశం, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకు చెందిన అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారని మాత్రం తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో ఆరు విభిన్న దేశాల జట్లు పాల్గొంటాయి. అయితే, ఈ టోర్నమెంట్‌లో కేవలం మూడు జట్లు మాత్రమే ఉంటాయి.
ఈ ‘లీగ్ ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహిస్తారు. మొదటి సీజన్‌లో లీగ్ ట్రై-సిరీస్ లా నిర్వహిస్తారు. ఇందులో భారత జట్టు, ఆసియా జట్టు, మిగిలిన ప్రపంచ జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఫైనల్‌కు ముందు ఆరు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇది చాలా పెద్ద టోర్నమెంట్ అని, భారత లెజెండ్స్ ఆటను మరోసారి చూడటం చాలా ఆనందంగా ఉందని’ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ వివేక్ ఖుష్లానీ అన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ వంటి ఆటగాళ్లు ఇండియన్ లెజెండ్స్ జట్టులో ఆడబోతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Mahesh Babu MAharshi: ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. మహేష్ బాబు మాటల్లో ఆనందం అసలు మేటరేంటంటే..(వీడియో)
Share Market Video: లక్ష పెట్టుబడి పెడితే.. ఆరు నెలల్లో రూ.7 లక్షలు..! ఎలానో ఈ వీడియో చూడండి..
FYI With Swathi Video: ప్రతి 2 గంటలకు ఒక చిన్నపిల్ల మీద రేప్ .. ఆపే ప్రయత్నం చేస్తున్నామా.?(వీడియో).