Shooting in Rodasi: అంతరిక్షంలో సినిమా షూటింగ్.. ఆ రోజే స్పేస్‌లోకి సోయెజ్ ఎంఎస్-19 త్వరగా షూటింగ్ పూర్తి చెయ్యాలని నిర్మాతలు(వీడియో)..
ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో.. అమెరికా వెళ్లొచ్చినంత ఈజీగా అంతరిక్షానికి వెళ్లొచ్చేస్తున్నారు మానవులు. అంతరిక్షంపై అడుగు పెట్టాలన్న కల నేర్చుకున్నాడు. ఇక అక్కడ నివాసం కోసం తహతహలాడుతున్న మనిషి తాజాగా స్పేస్‌లో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు.
ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో.. అమెరికా వెళ్లొచ్చినంత ఈజీగా అంతరిక్షానికి వెళ్లొచ్చేస్తున్నారు మానవులు. అంతరిక్షంపై అడుగు పెట్టాలన్న కల నేర్చుకున్నాడు. ఇక అక్కడ నివాసం కోసం తహతహలాడుతున్న మనిషి తాజాగా స్పేస్‌లో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. అంతరిక్షంలో షూటింగ్ జరుపుకొని త్వరలో భూమండలానికి రాబోతోంది ఓ సినిమా. రోదసిలో తొలి సినిమా షూటింగ్‌కు రంగం సిద్ధమైంది. స్పేస్‌లో తొలిసారి నటులతో సినిమాను షూట్ చేయనున్నారు. అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. దీని కోసం రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్ అంతరిక్ష ఏజెన్సీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నలుగురు నాన్ ప్రొఫెషనల్ నటుల్ని.. అంతరిక్ష సిబ్బందిగా స్పేస్ స్టేషన్‌కు తీసుకువెళ్లబోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఎగరనున్న సోయేజ్ ఎంఎస్-19 వ్యోమనౌక ద్వారా ఆ నటులు అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. ఆ సినిమాకు ఛాలెంజ్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు.
ఈ మూవీలో నటించే యాక్టర్లు ముందుగా జీరో గ్రావిటీ పరీక్షలు క్లియర్ చేసి, పారాచ్యూట్ శిక్షణ కూడా పొందాలి. ఈ నెల చివరలోగా ఈ నటులు తమ శిక్షణ ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన 36 ఏళ్ల నటుడు యులియా పెరిసిల్డ్, 37 ఏళ్ల క్లిమ్ షిపెంకో ప్రధాన సిబ్బందిలో ఉంటారు. 33 ఏళ్ల నటుడు అలెనా మోర్డవినో, కెమెరా డైరక్టర్ అలెక్సీ డుడిన్‌లు కూడా రిజర్వ్ క్రూగా వెళ్తారు. అంతరిక్షయానం గురించి ఎప్పుడూ ఆలోచన కూడా చేయని ఓ వైద్యుడు, అనూహ్యంగా వ్యోమగామిని కాపాడేందుకు రోదసికి వెళ్లాల్సి రావడం సినిమా ఇతివృత్తమని దర్శక నిర్మాతలు తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Rakul Preet Singh: నేను రకుల్‌ను కాదు…! షాకింగ్ కామెంట్స్ చేసిన పంజాబీ పాప(వీడియో)..
Viral Video: వరుడు దగ్గర కట్నం తీసుకుని ప్రియుడితో వధువు జంప్.. లబోదిబో మంటున్న వరుడు(వీడియో)..
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

