Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: నేను రకుల్‏ను కాదు...! షాకింగ్ కామెంట్స్ చేసిన పంజాబీ పాప(వీడియో)..

Rakul Preet Singh: నేను రకుల్‏ను కాదు…! షాకింగ్ కామెంట్స్ చేసిన పంజాబీ పాప(వీడియో)..

Anil kumar poka

|

Updated on: Sep 21, 2021 | 9:46 PM

మోస్ట్ టాలెంటెడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హిందీలో వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో రకుల్‌ టాలీవుడ్‌కు దూరమయ్యారన్న వార్తలు చక్కర్లు కొడుతుండటంతో వాటికి గట్టిగానే సమాధానమిచ్చారు రకుల్‌ప్రీత్‌సింగ్‌.

మోస్ట్ టాలెంటెడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హిందీలో వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో రకుల్‌ టాలీవుడ్‌కు దూరమయ్యారన్న వార్తలు చక్కర్లు కొడుతుండటంతో వాటికి గట్టిగానే సమాధానమిచ్చారు రకుల్‌ప్రీత్‌సింగ్‌. ప్రస్తుతం తన చేతిలో అరడజను సినిమాలున్నాయని.. కొత్త ప్రాజెక్ట్స్ కోసం టైమ్ కేటాయించేలేకపోతున్నానని చెప్పింది. తన డేట్స్ అడ్జెస్ట్ చేసే వాళ్లుంటే.. ఎవరైనా తనను సంప్రదించాలంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న కొండపొలం సినిమాలో నటిస్తున్నారు రకుల్.

ఇప్పటికే బాలీవుడ్‏లో చేతినిండా ప్రాజెక్ట్స్‏తో ఫుల్‌ బిజీగా ఉన్నారు రకుల్‌. మేడే, థాంక్ గాడ్ అంటూ అజయ్ దేవగణ్ సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు తమిళంలోని ఓ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇంకా.. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న డాక్టర్ జీ సినిమాలో హీరోయిన్‏గా చేస్తున్నారు. ఇందులో డాక్టర్ ఫాతిమా పాత్రలో రకుల్ కనిపించనున్నారు. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను తెలిపారు రకుల్‌. వైద్య వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని, ఈ సినిమా కోసం కొందరు డాక్టర్లను ఫాలో అయ్యానని తెలిపారు. డాక్టర్ కోటు ధరించగానే.. ఏదో బాధ్యతాయుతమైన ఫీలింగ్ తనను ఆవహించేదని, తాను నిజమైన డాక్టర్‏ కానని తెలిసినా, క్యారెక్టర్‌లో ఉన్నంతసేపు ఎంతో బాధ్యతగా ఫీలయినట్లు చెప్పుకొచ్చారు. డాక్టరల్‌ పాత్రలో తాను పేషెంట్స్‏ను ట్రీట్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో.. వారి జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో తెలిసిందన్నారు. ఫాతిమాగా కెమెరా ముందుకు వెళ్లిన తర్వాత తాను రకుల్‏ని అనే విషయం మరిచిపోయేదాన్నని, ఆ అనుభవం తనతో ఎప్పటికీ ఉంటుందంటూ రకుల్ ప్రీత్‌సింగ్‌ చెప్పుచ్చారు. 
మరిన్ని చదవండి ఇక్కడ : Love Story Movie team: లవ్ స్టోరీ టీంతో చిట్‌చాట్.. చాల ఫన్నీగా సాగిన ముచ్చట్లు.. ఫుల్ వీడియో మీకోసం..

 Viral Video: వరుడు దగ్గర కట్నం తీసుకుని ప్రియుడితో వధువు జంప్‌.. లబోదిబో మంటున్న వరుడు(వీడియో)..

 Tollywood Drugs Case Video: డ్రగ్స్‌ కేసులో తనీశ్‌ చిక్కేనా..? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు(వీడియో)…

 Prabhas, Rajamouli Video: బాహుబలి రిపీట్… ప్రభాస్‌, రాజమౌళి కాంబోలో మరో సినిమా.. (వీడియో)