AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh: ఆరు బంతులకు ఆరు సిక్సులు.. ఆ అద్భత ఘట్టాన్ని మళ్లీ కళ్లకు కట్టినట్లు చూపిన యూవీ. వైరల్‌ వీడియో..

Yuvraj Singh: ఓవర్‌లో మూడు సిక్సులు కొడితేనే అద్భుతంగా భావిస్తాం. అలాంటిది ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొడితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే అద్భుతం కదూ..!

Yuvraj Singh: ఆరు బంతులకు ఆరు సిక్సులు.. ఆ అద్భత ఘట్టాన్ని మళ్లీ కళ్లకు కట్టినట్లు చూపిన యూవీ. వైరల్‌ వీడియో..
Narender Vaitla
|

Updated on: Sep 21, 2021 | 10:30 PM

Share

Yuvraj Singh: ఓవర్‌లో మూడు సిక్సులు కొడితేనే అద్భుతంగా భావిస్తాం. అలాంటిది ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొడితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే అద్భుతం కదూ..! కానీ ఇది 2007కి ముందు అభిప్రాయం ఎందుకంటే.. టీమిండియా మాజీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ ఈ అద్భుతాన్ని సాకారం చేశాడు కాబట్టి. సెప్టెంబర్‌ 19, 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. బ్రాడ్‌ వేసిన 19 ఓవర్‌లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. తాజాగా సెప్టెంబర్‌ 19తో ఈ ఫీట్‌కు 14 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యూవీ తాజాగా తన ఫ్యాన్స్‌కు మరోసారి ఆ అద్భుత దృశ్యాన్ని గుర్తు చేశాడు. అదేంటి యూవీ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడుగా మళ్లీ ఎలా ఆడాడు అనేగా.. అయితే నిజంగా కాదులేండి. అచ్చంగా 14 ఏళ్ల క్రితం ఎలాంటి షాట్స్‌ కొట్టాడో వాటిని నటిస్తూ చూపించాడు. దీనంతటినీ వీడియోగా తీశారు. ఈ క్రమంలో యూవీ కాస్త హ్యూమర్‌ను కూడా జోడించాడు.

తలకు బండి హెల్మెట్‌ పెట్టుకొని బ్యాటింగ్‌కు దిగి నవ్వు తెప్పించాడు. ఇక ఇంట్లోనే టెర్రస్‌పై సిక్స్‌లు కొడుతున్నట్లు నటించాడు. చివరగా.. ‘నా యాక్టింగ్‌ గురించి మీరేమనుకుంటున్నారు.. బాలీవుడ్‌ లెవల్లో ఉందా.. ప్లీజ్‌ కామెంట్‌ చేయండి..’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో చూసిన యూవీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Murder Case: మెడికో సుధారాణి హత్య ఎందుకు జరిగింది.. అనుమానాలు.. చిక్కుముడులు..

UGC NET 2021: త్వరలో UGC NET అడ్మిట్ కార్డ్ విడుదల.. తాజా అప్‌డేట్‌ ఏంటంటే..?

Kids Breakfast: వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లో ఈ స్నాక్స్‌ను ట్రై చేయండి.. ఎప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ ఇవ్వరు..