AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder Case: మెడికో సుధారాణి హత్య ఎందుకు జరిగింది.. అనుమానాలు.. చిక్కుముడులు..

ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లై పది నెలలైంది. ఇద్దరు వేరు, వేరుగా ఉంటున్నారు. ఇక్కడి వరకు ఓకే. కాకినాడలో కలుద్దామన్నాడు. కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు కట్టుకున్నోడు. ఇష్టపడి చేసుకున్న ఇల్లాలును ఎందుకు చంపాల్సి వచ్చింది..?

Murder Case: మెడికో సుధారాణి హత్య ఎందుకు జరిగింది.. అనుమానాలు.. చిక్కుముడులు..
Murder Case
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 21, 2021 | 10:14 PM

కాకినాడ ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కాకినాడలోని ఓ ప్రైవేట్ లాడ్జ్‌లో వైద్య విద్యార్థిని సుధారాణి దారుణ హత్య గురయింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి.. ప్రస్తుతం కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఎనస్తీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం యాళ్లగూడేనికి చెందిన మానేపల్లి గంగరాజుతో పరిచయమైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. సుధారాణి హాస్టల్లో ఉంటూ కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో చదువుకుంటోంది.

ఐతే .. ఈనెల 17న తన భర్త గంగరాజు కాకినాడకు రావాలని కోరాడు. కాకినాడలో కలుసుకున్న ఇద్దరు కలిసి .. స్థానిక కోకిల సెంటర్లోని ద్వారకా లాడ్జిలో రూమ్‌ తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవ తీవ్ర వాగ్వివాదం మారింది. దీంతో గంగరాజు క్షణికావేశంలో పదునైన కత్తితో తన భార్య సుధారాణిని విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. రక్తపు మడుగులో సుధారాణి పడిపోయింది. ఆ వెంటనే గంగరాజు అక్కడి నుంచి పారిపోయి ..

సోమవారం ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. జరిగిన దారుణాన్ని చెప్పాడు. లాడ్జ్ లో ఘటనా స్థలికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు కాకినాడ పోలీసులు, సుధారాణి డెడ్‌ బాడీని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాకినాడ పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వివాహం చేసుకున్న భర్త గంగరాజు.. ఆమెను హతమార్చడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు. హత్యగల కారణాలపై క్లూస్ టీమ్స్ తో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: Balapur Laddu: అమరావతికి చేరిన బాలాపూర్ లడ్డూ.. సీఎం జగన్‌కు కానుకగా అందించిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌‌..