Balapur Laddu: అమరావతికి చేరిన బాలాపూర్ లడ్డూ.. సీఎం జగన్‌కు కానుకగా అందించిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌‌..

ఎంతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతికి చేరింది. పాత రికార్డులను బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్‌ చేసి దక్కించుకున్న...

Balapur Laddu: అమరావతికి చేరిన బాలాపూర్ లడ్డూ.. సీఎం జగన్‌కు కానుకగా అందించిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌‌..
Balapur Laddu Cm Jagan
Follow us

|

Updated on: Sep 21, 2021 | 7:19 PM

ఎంతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతికి చేరింది. పాత రికార్డులను బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్‌ చేసి దక్కించుకున్న లడ్డును ఏపీ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. సీఎం జగన్‌ను  మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ ఆర్‌ రమేష్‌ యాదవ్‌‌తోపాటు అబాకస్‌ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్‌ రెడ్డి కలుసుకున్నారు. బాలాపూర్ లడ్డు ప్రసాదంను ముఖ్యమంత్రికి కానుకగా అందించారు. బాలాపూర్‌లో లడ్డూ మళ్లీ రికార్డ్‌ సృష్టించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా పాత రికార్డులు బద్దలైపోయాయి. కొత్త హిస్టరీ క్రియేట్‌ అయ్యింది. ఇప్పుడు 18 లక్షల 90 వేలు పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలసి నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను 18లక్షల 90లకు దక్కించుకున్నారు.

ఈ ఏడాది 2019 కంటే లక్షా 30వేల రూపాయలు అధిక ధర పలికింది బాలాపూర్‌ లడ్డూ. గతేడాది 17లక్షల 60వేల రూపాయల ధర పలకగా..ఈసారి 18లక్షల 90వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన వేలంపాటలో..లడ్డూను సొంతం చేసుకున్న రమేష్‌ యాదవ్‌..ఏపీ సీఎం జగన్‌కు కానుకగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాలాపూర్‌ ప్రజల సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు.

విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం.. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎదురుచూస్తారు. ఎంత ధరైనా వెచ్చిస్తారు. 26 ఏళ్లుగా లడ్డూవేలంపాటలో ప్రత్యేకతను చాటుకున్న బాలాపూర్‌ గణేశుడు.. ఈ ఏడాది కూడా రికార్డు బ్రేక్‌ చేశారు.

2019లో బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలో 17లక్షల 60వేల రూపాయలకు కొలను రాంరెడ్డి కైవసం చేసుకున్నారు. ఇప్పుడు బాలాపూర్‌ లడ్డూకు రికార్డు బ్రేక్‌ ధర పలికింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన వేలంలో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈక్రమంలోనే.. 2019లో బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి.. గతేడాది కరోనా ఎఫెక్ట్‌ కారణంగా.. ఇప్పుడు 17 లక్షల 60 వేల రూపాయలను చెల్లించారు. ఇక.. ఈ ఏడాది లడ్డూను సొంతం చేసుకున్న స్థానికేతురులైన ఏపీ ఎమ్మెల్సీ రమేష్‌, శశాంక్‌ రెడ్డి.. ఇప్పటికిప్పుడే 18 లక్షల 90 వేలను చెల్లించారు.

ఇవి కూడా చదవండి: KTR-Revanth: డ్రగ్స్‌పై మాట్లాడొద్దు.. రేవంత్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటి సివిల్‌ కోర్టు..