Heart Attack: హార్ట్ ఎటాక్ నివారించడానికి 4 మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..

Heart Attack: ఇటీవల నటుడు సిద్ధార్థ్ శుక్లా మృతి అందరిని కలచివేసింది. 40 సంవత్సరాల వయసులో సిద్ధార్థ్ గుండెపోటుతో మరణించాడు. ఇటీవల కాలంలో చాలా తక్కువ

Heart Attack: హార్ట్ ఎటాక్ నివారించడానికి 4 మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..
Heart Attack
Follow us

|

Updated on: Sep 21, 2021 | 6:50 PM

Heart Attack: ఇటీవల నటుడు సిద్ధార్థ్ శుక్లా మృతి అందరిని కలచివేసింది. 40 సంవత్సరాల వయసులో సిద్ధార్థ్ గుండెపోటుతో మరణించాడు. ఇటీవల కాలంలో చాలా తక్కువ వయసున్నవారు గుండెపోటుకు గురవుతున్నారు. గణాంకాల ప్రకారం.. భారతదేశంలో ప్రతి 4 మరణాలలో ఒకరు హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. 80 శాతం కేసులకు గుండెపోటే కారణం. ఆశ్చర్యకరంగా 40 నుంచి 55 ఏళ్ల వ్యక్తులే ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే జీవన శైలిలో ఈ 4 మార్పులు చేస్తే గుండెపోటును నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. నాణ్యత లేని వంట నూనెలను మార్చండి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం గుండెకు మంచిది కాదు. డబ్బు ఆదా చేయడానికి మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ ఆరోగ్యంపై పడుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని కాపడటానికి సరైన నూనెలను ఎంచుకోండి. ఇవి కొంచెం ఖరీదు కావొచ్చు కానీ మీ ఆరోగ్యం కంటే ఏమి ఎక్కువ కాదని తెలుసుకోండి.

2. వ్యాయామం తప్పనిసరి కదలకుండా పనిచేసేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక కాలంలో చాలా ఉద్యోగాలు ఇలా చేసేటివే. శారీరక శ్రమ మనిషికి కచ్చితంగా అవసరం. ఎండార్ఫిన్స్, సెరోటోనిన్-మూడ్ అప్‌ లిఫ్టింగ్ వంటి ఒత్తిడిని తగ్గించే హార్మోన్‌లను సరైన మోతాదులో పొందడానికి ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ తప్పనిసరి. దీర్ఘకాలిక ఒత్తిడి, డిప్రెషన్ గుండె జబ్బులకు ప్రధాన కారణమని పలు అధ్యయనాలలో తేలింది. అందుకే కచ్చితంగా యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

3. ఒత్తిడి నుంచి బయటపడండి ఆధునిక జీవన శైలిలో చాలామంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో వారు తెలియకుండానే హార్ట్ ఎటాక్‌కి గురవుతున్నారు. ఒత్తిడి తగ్గించుకుంటే గుండెపై భారం తగ్గుతుంది. అప్పుడప్పుడు మ్యూజిక్‌ వినడం, గేమ్స్‌ ఆడటం, సినిమాలు చూడటం చేస్తే కొంతవరకు రిలాక్స్ అవుతారు. ప్రకృతి ఒడిలో ఎక్కువ సేపు గడపటానికి ప్రయత్నించండి.

4. నిద్ర, మంచి ఆహారం ధీర్ఘకాలిక నిద్రలేమి గుండెపోటుకు కారణమవుతుంది. కాబట్టి మీ గుండె ఆరోగ్యం కోసం ప్రతిరోజు కనీసం 6 గంటల నిద్ర అవసరం. భోజనం 12-12.30 PM, అల్పాహారం 7.00 AM కి చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం, టిఫిన్ మధ్య 4 నుంచి 5 గంటల గ్యాప్ ఉండాలన్నారు. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి తోడ్పడుతుందన్నారు. ప్రతిరోజు ఎక్కువగా నీరు తాగాలి. భోజనం చేసిన కొద్ది సేపటి తర్వాత గింజలు, పండ్లు తింటే మంచిది. మంచి నిద్ర కోసం కనీసం 2 గంటల భోజనాన్ని ముగించాలి.

KTR-Revanth: డ్రగ్స్‌పై మాట్లాడొద్దు.. రేవంత్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటి సివిల్‌ కోర్టు..

Big News Big Debate Live Video: వైట్‌ ఛాలెంజ్‌లు.. రాజకీయ మంటలు… (లైవ్ వీడియో)

Customers Alert: ఆటో డెబిట్ రూల్స్‌లో కొత్త మార్పులు.. కస్టమర్లు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!