Telangana Corona: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 244 మందికి పాజిటివ్

తెలంగాణలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో 50,505 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Telangana Corona: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 244 మందికి పాజిటివ్
Corona Cases
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 21, 2021 | 8:16 PM

Telangana Corona Cases Today: తెలంగాణలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో 50,505 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,906కు చేరుకుంది. ఇక, నిన్న కరోనా బారినపడి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహమ్మారి ధాటికి బలైనవారి సంఖ్య 3,907 కు చేరింది. అదే సమయంలో 296 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తంగా చూస్తే.. 6,55,061 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,938 మంది ప్రస్తుతం కోవిడ్ చికిత్స పొందుతున్నారు. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 2,59,47,467 నమూనాలు పరీక్షించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలావుంటే.. దేశంలో కరోనా ఉధృ నానాటికీ పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,115 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 252 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,04,534 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,45,385 చేరింది. నిన్న కరోనా నుంచి 34,469 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,27,49,574 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,09,575 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా.. 184 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలకు తగ్గినట్లు హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ప్రస్తుతం రికవరీ రేటు దేశంలో 97.75 శాతంగా ఉండగా.. పాజిటివ్ రేటు 2.08 శాతంగా ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81,85,13,827 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 96,46,778 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి: KTR-Revanth: డ్రగ్స్‌పై మాట్లాడొద్దు.. రేవంత్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటి సివిల్‌ కోర్టు..