KRMB Meeting: జల జగడంలో మరో ఎపిసోడ్.. ఏపీ చేస్తున్నవి నిరాధారమైన వాదనలు.. కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ..
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మరో ఎపిసోడ్ మొదలైంది. కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం గతంలో రాసిన లేఖపై వివరణ ఇచ్చింది. తెలంగాణలో గోదావరి నీటి మళ్లింపు దగ్గర టెలిమెట్రీలు ఏర్పాటు...
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మరో ఎపిసోడ్ మొదలైంది. కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం గతంలో రాసిన లేఖపై వివరణ ఇచ్చింది. తెలంగాణలో గోదావరి నీటి మళ్లింపు దగ్గర టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని ఏపీ బోర్డును కోరగా.. అలాంటి అవసరే లేదని తేల్చేశారు తెలంగాణ ENC మురళీధర్(Telangana irrigation engineer-in-chief). కృష్ణా నీళ్లు ఇవ్వని ప్రాంతాలకే తాము గోదావరి నీళ్లు ఇస్తున్నామని వివరించారు. గోదావరి జలాల మళ్లింపుతో కృష్ణాలో నీరు మిగులుతోందని ENC మురళీధర్ గుర్తుచేశారు. తెలంగాణ మళ్లిస్తున్న నీటిలో గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా ఏపీ వాటా కోరుతోందని ENC అభ్యంతరం వ్యక్తం చేసింది. 1978లో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జున సాగర్ పైన జలాలను వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని తెలుపుతూ.. కృష్ణా బోర్డుకు వివరణాత్మకంగా లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.
గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై.. ఆయన లేఖలో వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చేసిన నిరాధారమైన వాదనలు పట్టించుకోవద్దని ఈఎన్‌సీ సూచించారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలించే చోట టెలీమెట్రీలు ఏర్పాటు చేయడంతో పాటు గోదావరి నుంచి తరలించే జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలని కేఆర్‌ఎంబీని కోరింది.
ఈ మేరకు ఆయన స్పందించారు. కృష్ణా నీరు ఇవ్వని ప్రాంతానికే గోదావరి నీటిని మళ్లిస్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాల మళ్లింపుతో కృష్ణాలో నీరు మిగులుతోందని, ట్రైబ్యునళ్ల ప్రకారం అదనపు వాటా కిందికి రాదని స్పష్టం చేశారు. మిగులు నీటిని ఎగువ ప్రాజెక్టుల్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. తక్కువ నీటి మళ్లింపునకు టెలీమెట్రీలు అవసరం లేదని లేఖలో ఈఎన్‌సీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: KTR-Revanth: డ్రగ్స్‌పై మాట్లాడొద్దు.. రేవంత్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటి సివిల్ కోర్టు..