AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Liquor Shops: తెలంగాణ లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ

Telangana Liquor Shops: తెలంగాణ రాష్ట్రంలో ఏ-4 కాటగిరిలో లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్‌లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు..

Telangana Liquor Shops: తెలంగాణ లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ
Subhash Goud
|

Updated on: Sep 21, 2021 | 8:25 PM

Share

Telangana Liquor Shops: తెలంగాణ రాష్ట్రంలో ఏ-4 కాటగిరిలో లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్‌లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 87ను సెప్టెంబర్‌ 20న విడుదల చేసింది.

తెలంగాణా ఎక్సైజ్‌ చట్టం 1968 లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వ ఏ- 4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021 -23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనిలో భాగంగా గౌడ్‌లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు 5 శాతం కేటాయిస్తూ ఇచ్చిన జీవోపై తగు చర్య తీసుకోవాల్సిందిగా ప్రొహిబిషన్ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ జీవో విడుదల చేశారు.

కాగా, అంచనాలకు అందని రీతిలో నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తాజాగా ఆ విషయాన్ని మరోసారి నిరూపించారు. తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆయన అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల కాలంలో దళితులకు దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టి.. అందరూ తెలంగాణ వైపు చూసేలా చేసిన ఆయన.. తాజాగా మద్యం షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొనటం సంచలనంగా మారింది.

Order

ఇవీ కూడా చదవండి:

Gram Suraksha Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.1500 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు..!

Bank New Rules: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? ఈ విషయాలు తెలుసుకోండి.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న నిబంధనలు

HDFC Loan: పండగ సీజన్‌లో రుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. రుణ గ్రహీతలకు అదిరిపోయే ఆఫర్‌..!