SBI Clerk Pre Result 2021: ఎస్బీఐ క్లర్క్ పోస్టు ఫలితాలు విడుదల.. ఇలా తెలుసుకోండి..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 21, 2021 | 7:45 PM

SBI Clerk Pre Result 2021: ఎస్బీఐ క్లర్క్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. నియామక పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- sbi.co.in ని సందర్శించడం ద్వారా

SBI Clerk Pre Result 2021: ఎస్బీఐ క్లర్క్ పోస్టు ఫలితాలు విడుదల.. ఇలా తెలుసుకోండి..
Sbi Clerk Pre Result 2021

Follow us on

SBI Clerk Pre Result 2021: ఎస్బీఐ క్లర్క్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. నియామక పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- sbi.co.in ని సందర్శించడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా జూనియర్ అసోసియేట్ క్లర్క్ 5000 పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ అసోసియేట్ క్లర్క్ పోస్టుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తు ప్రక్రియ 27 ఏప్రిల్ 2021 న ప్రారంభించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి 2021 మే 20 వరకు సమయం ఇచ్చారు. అడ్మిట్ కార్డులు 29 జూన్ 2021 న జారీ చేశారు. పరీక్ష జూలై నెలలో నిర్వహించారు. అధికారిక వెబ్‌సైట్- sbi.co.in లో ఫలితాలను పొందుపరిచారు. అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్య, పాస్‌వర్డ్ సహాయంతో ఫలితాలను తెలుసుకోవచ్చు.

రిజల్ట్‌ ఇలా తెలుసుకోండి..

1. ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన కెరీర్‌పై క్లిక్ చేయండి. 3. SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2021 ప్రీ ఎగ్జామ్ ఫలితాల ఎంపికకు వెళ్లండి. 4. అభ్యర్థించిన వివరాలను సమర్పించండి. 5. ఫలితాలు తెరపై కనిపిస్తాయి. 6. డౌన్‌లోడ్ చేయండి తదుపరి ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

SBI క్లర్క్ పరీక్షా విధానం

ఈ పరీక్ష రెండు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కావాలి. ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలో పాల్గొనడానికి అర్హులు. SBI క్లర్క్ పరీక్షలో ఇంటర్వ్యూ రౌండ్ ఉండదు.

ప్రిలిమ్స్ పరీక్ష: SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి జవాబుకి ఒక మార్కు అంటే మొత్తం 100 మార్కుల పేపర్ తయారు చేస్తారు. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (QA) నుంచి 35 ప్రశ్నలు, రియు రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా ? అయితే ప్రమాదమే.. గ్రీన్ టీ ఎప్పుడు, ఎంత తాగితే ప్రయోజనం ఉంటుందో తెలుసా..

Yamaha R15 Bike: కుర్రాళ్ల కోసం మార్కెట్లో యమహా కొత్త బైక్‌.. ధర ఎంతో తెలిస్తే షాకే..

ఈ పదార్థాలు తిన్నాక పాలు పొరపాటున కూడా తాగొద్దు.. ఒకవేళ తాగితే ఈ సమస్యలు తప్పవు.. అవెంటో తెలుసుకొండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu