Covid-19 – CBSE: ఎలాంటి ఫీజు లేదు.. విద్యార్థులకు శుభవార్త.. బోర్డ్ పరీక్షపై సీబీఎస్‌ఈ కీలక ప్రకటన..!
Covid-19 - CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ విధానంలో ఇటీవల స్వల్ప మార్పులు చేసింది. కరోనా మహమ్మారి తర్వాత..
Covid-19 – CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ విధానంలో ఇటీవల స్వల్ప మార్పులు చేసింది. కరోనా మహమ్మారి తర్వాత విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో విద్యా సంవత్సరాన్ని రెండు టర్మ్‌లుగా విభజించి బోర్డ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డ్ ఇప్పటికే తెలిపింది. ఇక విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు వసూలు చేయడం లేదని బోర్డ్ స్పష్టం చేసింది. ఈ మేరకు పీటీఐ ఆ విషయాన్ని ట్వీట్ చేసింది.
కొవిడ్19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోర్డ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు లేదని సీబీఎస్ఈ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10, 2021 నాటికి 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ మొదటి టర్మ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, సీబీఎస్‌ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన సీబీఎస్ఈ పరీక్ష రాయనున్న విద్యార్థులకు, లేక తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోయిన వారికి, సంరక్షకుడు లేదా సంరక్షకురాలు చనిపోయిన విద్యార్థులకు 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి సీబీఎస్ఈ మినహాయింపు ఇచ్చింది. మరోవైపు పాఠశాలలు బోర్డు ఎగ్జామ్‌కు హాజరుకానున్న విద్యార్థుల జాబితాలను సీబీఎస్ఈకి ఇదివరకే పంపించింది. విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా బోర్డ్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 9వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయంతో తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు కొంత మేర మేలు జరుగనుంది.
No examination, registration fees to be charged for Class 10, 12 students who have lost parents due to COVID-19: CBSE
— Press Trust of India (@PTI_News) September 21, 2021