AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin for Kids: థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శుభవార్త.. త్వరలో చిన్నారులకు కొవాగ్జిన్ టీకా..!

Covaxin for Children: వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతున్నట్టు ప్రకటించింది. ఇకపై 18 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా కోవాగ్జిన్ అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది.

Covaxin for Kids: థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శుభవార్త.. త్వరలో చిన్నారులకు కొవాగ్జిన్ టీకా..!
Covaxin For Kids
Balaraju Goud
|

Updated on: Sep 22, 2021 | 8:16 AM

Share

Covaxin for Children: కరోనా మహమ్మారి రెండు విడతల్లో ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. మరోసారి మూడో దశ ప్రభావం కూడా భారీగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి అక్టోబరు నాటికి గరిష్ఠానికి చేరుతుందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐఎండీ) నిపుణుల కమిటీ నివేదిక హెచ్చరించింది. థర్డ్ వేవ్‌లో పిల్లలు ఎక్కువ ప్రభావితమవుతారని, పెద్దలకు కూడా ముప్పు ఉంటుందని తెలిపింది. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొడానికి వైద్య సౌకర్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించింది.

కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశలో ఉన్నప్పటికీ, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇదే సమయంలో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్పడంతో కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే.. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తోంది. ఇప్పటికే చాలామంది వ్యాక్సినేట్ అయ్యి ఉన్నారు. ఈ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగం చేసే దిశగా దేశ వ్యాప్తంగా అడుగులు పడుతున్నాయి. అయితే, భారత్ బయోటెక్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇది శుభవార్తే అని చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ మరో శుభవార్త చెప్పింది. కరోనా నియంత్రణ కోసం నిరాటంకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతున్నట్టు ప్రకటించింది. ఇకపై 18 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా కోవాగ్జిన్ అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది. త్వరలో చిన్న పిల్లలకు కూడా అందించేందుకు కొవాగ్జిన్‌ను సిద్ధం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే 2,3 దశల ట్రయల్స్ పూర్తయ్యాయని, ఇందుకు సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు వచ్చే వారానికి అందజేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని తెలిపింది.

చిన్న పిల్లల వ్యాక్సిన్ కు సంబంధించి ఇప్పటికే ‘ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి అన్నారు. డీసీజీఐ ఆమోదం లభించిన వెంటనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీనికి తోడు 18 ఏళ్లు నిండిన వారికి అందిస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామని, అక్టోబర్‌‌లో ఈ సంఖ్యను 5.5 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. ఇతర భాగస్వామ్య సంస్థలు కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఈ సంఖ్య 10 కోట్లు దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇదిలావుంటే, ప్రస్తుతం ప్రపంచాన్నంతా డెల్టా వేరియంట్లు భయపెడుతున్నాయి. రోజుకో కొత్త వేరియంట్ తెరపైకి వస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారిని కూడా కరోనా వదలడం లేదు. దీంతో వ్యాక్సిన్ లు ఎంత సురక్షితం అనే అనుమానాలు ఉన్నాయి. కానీ కోవిడ్ 19 వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ డెల్టా ప్లస్ వేరియంట్‌పై సమర్థవంతంగా పని చేస్తోందని ఐసీఎంఆర్ ఇటీవల తమ అధ్యయనంలో స్పష్టం చేసింది. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా కోవాగ్జిన్‌ను రూపొందించాయి. డెల్టా వేరియంట్ నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది కరోనాకు చెందిన మిగతా వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరమని హెచ్చరించారు.

ప్రస్తుతందేశంలో 70 డెల్టా ప్లస్ కేసులను గుర్తించినట్టు కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించింది. కోవాగ్జిన్ కరోనా ఇన్‌ఫెక్షన్‌పై 77.8 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని గత నెలలోనే భారత్ బయోటెక్ తెలిపింది. డెల్టా వేరియంట్‌ను 65.2 శాతం రక్షణ ఇస్తుందని వెల్లడించింది. ఇప్పటికే భారత్ సహా బ్రెజిల్, ఫిలిప్పిన్స్ వంటి 15 దేశాలు ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ చ్చింది. ఇక 2 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలపై సెకండ్ డోస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ట్రయల్స్ సాగుతున్నాయి.

Read Also… Covishield Vaccine: అమెరికా వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక, కోవిషీల్డ్ తీసుకున్నవారికి అనుమతి

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు