RRR News: మార్కెట్లోకి ఆర్.ఆర్.ఆర్ టీషర్ట్‌లు, మాస్కులు వచ్చేశాయ్ చూశారా.? ఎలా కొనుగోలు చేయాలంటే..
RRR News: రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ..
RRR News: రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ సినిమాలో దాదాపు ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమురం భీమ్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై చిత్ర యూనిట్ అంచనాలను ఎప్పటికప్పుడు పెంచేస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మరోసారి సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేశారు.
ఇక తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో వీరిద్దరి గెటప్స్, పాత్రలకు సంబంధించిన లోగోలతో కూడిన టీషర్టులు, కప్పులు, మాస్కులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని హీరో రానా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ వస్తువులను లాంచ్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది అంటూ పోస్ట్ చేసిన రానా.. రామ్ చరణ్, ఎన్టీఆర్, సినిమా అభిమానులు వేడుకల్ని ప్రారంభించండి అంటూ క్యాప్షన్ జోడించారు.
ఈ ట్వీట్‌లో టీషర్టులు, మాస్కులు కొనుగోలు చేసుకోవడానికి సంబంధించిన లింక్‌ను కూడా రానా పోస్ట్ చేశారు. ‘ఫుల్లీ ఫిల్మీ’ అనే వెబ్‌సైట్ వీటిని కొనుగోలు చేసుకునే అవకాశం కలిపించారు. ఆసక్తి ఉన్న వారు నేరుగా ఆ లింక్‌ను క్లిక్ చేసి కొనుగోలు చేసుకోవచ్చు.
రానా చేసిన ట్వీట్..
Proud to launch the Official Merchandise of #RRR, the labour of love of my alumnus dir @ssrajamouli on a brand I really love, @fullyfilmy_offl ♥️♥️ Fans of @AlwaysRamCharan , @tarak9999 & Cinema, start the celebrations: https://t.co/F6mnb6KF3V#RRRonFF#RRRonFullyFilmy pic.twitter.com/VSdOyRKdqP
— Rana Daggubati (@RanaDaggubati) September 21, 2021
Ali Reza: తండ్రి కాబోతున్న తెలుగు బిగ్ బాస్ కంటిస్టెంట్.. ఆనందంలో చిందులేసిన అలీ రెజా ఫొటోస్…