Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అరాచకాలు.. లోబో బండారం బయటపెట్టిన పింకీ..
బిగ్ బాస్ సీజన్ 5లో మునుపెన్నడూ చూడని అరాచకాలు చూడాల్సి వస్తుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఏడుపులే కాదు.. చీకటి వ్యవహారాలు ఒకొక్కటి బయటకు వస్తున్నాయి.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో మునుపెన్నడూ చూడని అరాచకాలు చూడాల్సి వస్తుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఏడుపులే కాదు.. చీకటి వ్యవహారాలు ఒకొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రియమాట్లాడుతూ..హౌస్‌లో అర్ధరాత్రి వ్యవహారం బయటపెట్టింది. రవి- లహరి బాత్రూమ్‌లో హగ్గులు చేసుకుంటున్నారని సంచలన విషయాన్నీ బయట పెట్టింది. దాంతో హౌస్‌లో ఉన్నవాళ్లే కాదు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. రవికి లహరి అర్ధరాత్రి సమయంలో బాత్రూం దగ్గర కౌగిలించుకుంటూ కనిపించారని ప్రియా అనడంతో వివాదం రేగింది. ప్రియా పై ఇటు లహరి.. అటు రవి ఇద్దరు మండిపడ్డారు. అయినా సరే ప్రియా వెనక్కి తగ్గలేదు. నేను చూసిందే చెప్పను అంటూ సమాధానం చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో అరాచకం బయట పడింది. ఈ సారి లోబో బండారాన్ని బయటపెట్టింది ప్రియాంక.. ప్రియాంక చెప్పిన విషయానికి అందరూ షాక్ అయ్యారు.
ఇక మంగళవారం నాటి 17వ ఎపిసోడ్‌లో ప్రియాంక షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. తనతో లోబో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని అంది ప్రియాంక. ప్రియ, కాజల్, సిరి కూర్చుని ఉండగా..ప్రియాంక మాట్లాడుతూ..నేను సాయంత్ర హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకుని ఉన్నాను.. అది నాకు అన్ కంఫర్ట్‌గా అనిపించింది.. నాకు తెలుసు అది కాస్త ఇబ్బందిగానే ఉందని.. అందుకే నాకు వీలైనంత వరకూ కవర్ చేసుకుంటూనే ఉన్నాను. అక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నాకు రెండు మూడు సార్లు సైగ చేశాడు. నాకు సీన్ అర్థమై మరింత జాగ్రత్తగా ఉన్నాను. లోబో సడెన్‌గా వచ్చి లోపలికి చేయిపెట్టాడు. కానీ నేను దాన్ని చాలా ఫన్నీగా తీసుకున్నా.. పట్టించుకోలేదు.. వెంటనే నేను వెళ్లి డ్రెస్ మార్చేసుకున్నా’ అని చెప్పింది ప్రియాంక. దానికి వెంటనే కాజల్ మరి నువ్వు ఏం అనలేదా.. ? వెంటనే సీరియస్ అవ్వాలి కదా..? అంది. ఆతర్వాత సిరి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని నేను రవికి చెప్తాను అంది. ఇంతలో సర్లే వదిలేయండిలే అని అన్నది ప్రియాంక. అప్పుడే అక్కడికి వచ్చిన లోబో ప్రియాంకకు హగ్ ఇచ్చాడు..
మరిన్ని ఇక్కడ చదవండి :