Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China’s Evergrande Crisis: ప్రపంచంపై చైనా మరో బాంబు? పలు దేశాలను ఆర్థికంగా ముంచబోతోందా?

China’s Evergrande crisis: ప్రపంచంపై చైనా మరో బాంబు వేసిందా..? ఇప్పటికే ప్రపంచం నెత్తిన కరోనా కుంపటి పెట్టిన చైనా.. ఇప్పుడు దివాలా తీసిన ఎవర్‌గ్రాండ్‌తో ఆ దేశమే కాదు.. మిగతా దేశాలనూ ఆర్థికంగా ముంచబోతోందా?

China’s Evergrande Crisis: ప్రపంచంపై చైనా మరో బాంబు? పలు దేశాలను ఆర్థికంగా ముంచబోతోందా?
Evergrande
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 21, 2021 | 5:48 PM

China’s Evergrande crisis: ప్రపంచంపై చైనా మరో బాంబు వేసిందా..? ఇప్పటికే ప్రపంచం నెత్తిన కరోనా కుంపటి పెట్టిన చైనా.. ఇప్పుడు దివాలా తీసిన ఎవర్‌గ్రాండ్‌తో ఆ దేశమే కాదు.. మిగతా దేశాలనూ ఆర్థికంగా ముంచబోతోందా?  చైనాకు చెందిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ దివాలా తీసింది. 305 బిలియన్ డాలర్ల అప్పుల్లో ఉన్న ఈ సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేసేందుకు సిద్దంగా ఉంది. ఇళ్ల నిర్మాణానికి ఎవర్ గ్రాండ్ కు అడ్వాన్స్ లు చెల్లించిన ఎంతో మంది చైనీయులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఒకటీరెండు కాదు.. ఆ కంపెనీ దగ్గర 16 లక్షల మందికి చెందిన ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. చైనాలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇది చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీ ప్రస్తుతం ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు.

చైనాలో ఎవర్‌ గ్రాండ్ అనేది అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ. 1996లో హ్యూ కా యాన్ దీన్ని ఏర్పాటు చేశారు. లక్షా 23వేల 276మంది ఉద్యోగులున్నారు ఈ కంపెనీలో. ఒకప్పుడు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లిస్ట్ లో కూడా ఉన్న ఈ కంపెనీ మొత్తం 280 నగరాల్లో కార్యకలాపాలు విస్తరించింది. మొత్తం 1,300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టింది.

ఎవర్ గ్రాండ్ కు అప్పిచ్చిన సంస్థల్లో 128 కి పైగా బ్యాంకులు, 121 నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 305 బిలియన్ డాలర్లు. చైనా సంస్థల్లో అతిపెద్ద రుణ గ్రహీత కూడా ఎవర్‌ గ్రాండే. ఒక రకంగా చెప్పాలంటే అప్పులతోనే బూమ్ సృష్టించింది సంస్థ. 2020లో చైనాలో రియల్ సంస్థల రుణాల పై పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా నియంత్రణ చర్యలు చేపట్టింది. దీన్నే త్రీ రెడ్‌లైన్స్ అంటారు. ఈ నిబంధనల ప్రకారం ఒకసారి అప్పు తీసుకున్నా.. ఏడాది దాటితే చాలు, అవి చెల్లించకపోయినా మళ్లీ అప్పు చేసుకోవచ్చు. ఈ లూప్‌హోల్‌తో ఎవర్ గ్రాండ్ సంస్థ అప్పులు చేసుకుంటూ పోయింది. జూన్ 23న ఎవర్ గ్రాండ్ రేటింగ్ ను బి ప్లస్ నుంచి ‘బి’కి తగ్గించిన ఫిచ్ రేటింగ్ సంస్థ. దీంతో చైనా బ్యాంకులు అప్పులు చెల్లించాలని ఒత్తిడి మొదలుపెట్టాయి. చివరికి వాటిని తీర్చే పరిస్థితి లేదని ఎవర్‌గ్రాండ్ ఒప్పేసుకుంది.

ఎవర్ గ్రాండ్ స్వీయ తప్పిదాలు చేసింది. ప్రత్యేకించి ఓ సాకర్‌ టీమ్‌ని కొన్న సంస్థ.. లోటస్ ఆకారంలో సాకర్ స్టేడియం కూడా నిర్మిస్తోంది. అందుకు పెట్టుబడి అక్షరాలా 1.7 బిలియన్‌ డాలర్లు. బాటిల్ వాటర్, ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలోకి ఎవర్‌ గ్రీన్ ప్రవేశించింది. ఏప్రిల్ 2021 నాటికి ఒక్క వాహనం అమ్మనప్పటికీ కంపెనీ ఈవీ వ్యాపారం విలువ 87 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదీ ఓ ఆర్థిక నేరం. కంపెనీ దివాల తీయనున్న నేపథ్యంలో ఎవర్ గ్రాండ్ షేర్ ధర 80శాతానికి తగ్గిపోయింది. ఆఖరికి తన కంపెనీ ఉద్యోగులను కూడా అప్పులు అడుగుతోంది సంస్థ. అప్పులు ఇస్తారా, లేదా బోనస్ వదులుకుంటారా అంటూ బెదిరిస్తోంది.

ప్రపంచంపై ఎవర్ గ్రాండ్ ప్రభావం చాలా గట్టిగానే ఉండే చాన్స్‌ కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్‌ సంస్థ దెబ్బతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చైనాలో అమెరికా పెట్టుబడులు, అమెరికాలో చైనా సంస్థల పెట్టుబడులు కూడా దారుణంగా పడిపోతున్నాయి.

శుక్రవారం ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 9.42 ట్రిలియన్ల నుంచి రూ.8.85 ట్రిలియన్లకు తగ్గిపోయింది. ఇదే ప్రభావం ఇక ముందు కూడా భారత్‌ మార్కెట్లపైనా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చైనా కంపెనీ సంక్షోభంతో… భారత్‌లోని మెటల్ కంపెనీలపై ప్రభావం పడింది.

Also Read..

షాకింగ్.. హవానా సిండ్రోమ్ భారత్‌కు చేరిందా? అమెరికా ఇంటెలిజన్స్ అధికారికి సిండ్రోమ్ లక్షణాలు

మరోసారి సత్తా చాటిన వ్లాదిమిర్‌ పుతిన్‌ ‘డ్యూమా’కు జరిగిన ఎన్నికల్లో ‘యునైటెడ్‌ రష్యా పార్టీ’ ఘన విజయం