Indian Railways Jobs: ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు.. 3093 అప్రెంటిస్ జాబ్స్.. అర్హతలు.. ఇతర వివరాలు..!
Indian Railways Jobs: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ సంస్థల నుంచి ఉద్యోగ..
Indian Railways Jobs: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ సంస్థల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇక రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్.. నార్తర్న్ రైల్వే సంస్థల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3093 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 20 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 20.
అప్రెంటీస్ కాలపరిమితి, జీత భత్యాలు, ఎంపిక విధానం తదితర వివరాలను సెప్టెంబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ సమయంలో వెల్లడిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ http://rrcnr.org/ ను సందర్శించవచ్చు.
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: అభ్యర్థుల వయసు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి.
నోటిఫికేషన్ విడుదల తేదీ: సెప్టెంబర్ 14, 2021 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 20, 2021 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది: అక్టోబర్ 20, 2021 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: