JNVST Class-VI admission: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..?
Navodaya Vidyalaya 6th Class Admission Notification: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే విద్యాసంవత్సారనికి (2022-23) సంబంధించి
Navodaya Vidyalaya 6th Class Admission Notification: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే విద్యాసంవత్సారనికి (2022-23) సంబంధించి విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ నవంబర్ 30 గా నిర్ణయించారు. ఈ పరీక్షలో ఎంపికైతే చాలు.. ప్లస్ 2 (ఇంటర్) వరకు ఉచితంగా చదువుకోవచ్చు. దీంతోపాటు వసతి, భోజనం కూడా కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం (2022-23) ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
నవోదయ విద్యాలయ లో 2022 – 23 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం కోసం జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల సెప్టెంబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ లోపల ఆన్‌లైన్‌ల్ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 – 2020 , 2020-21, విద్యా సంవత్సరాలలో వరుసగా 3, 4, తరగతులు చదివి ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరం లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. విద్యార్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదీలను కలుపుకొని)
దరఖాస్తు చేసే విదానం.. నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫాంను డౌన్ లోడ్ చేసుకొని దానిని పూర్తి చేయాలి. 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ధృవీకరింపజేయించాలి. ఆ ఫాంను మరలా అన్‌లైన్‌లో అప్లోడ్ చెయ్యాలి. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలోని నియమ నిబంధనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
★ ఈ కింది వెబ్‌సైట్ల నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలి
www.navodaya.gov.in
https://navodaya.gov.in/nvs/en/Admission-JNVSTJNVST-class/
http://cbseitms.in/nvsregn/index.aspx
★ఆన్ లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ – 20/09/2021 ★ దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ – 30/11/2021 ★ పరీక్ష తేదీ – 30/04/2022
నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒక్కసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హహ ఉంటుంది.
Also Read: