NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే.?

NIT Recruitment 2021: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ.. అగర్తలలోని..

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే.?
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Sep 20, 2021 | 8:41 AM

NIT Recruitment 2021: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ.. అగర్తలలోని నిట్‌ కేంద్రంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో డిప్యూటీ రిజిస్ట్రార్‌, డిప్యూటీ లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ రిజస్ట్రార్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను మొదట రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు 30-09-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: నిరుద్యోగులకు సువర్ణవకాశం..! 4 ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వనున్న ఇండియన్ రైల్వే.. అర్హులెవరంటే..?

IRCTC Recruitment 2021: పదో తరగతి అభ్యర్థులకు గుడ్ న్యూస్.. IRCTCలో ఉద్యోగ అవకాశాలు..

CLW Recruitment: ఐటిఐ అర్హత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండానే టెన్త్ మార్కులతో ఉద్యోగవకాశాలు