‘మంత్రిగా పనికిరారు.. సినీ నటి కావచ్చు..’ మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యేపై కేసు

Kerala Health Minister Veena George: కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జిపై కేసు నమోదయ్యింది. కేరళలో కరోనా కేసుల ఉధృతిపై పీసీ జార్జి ఓ సీనియర్ జర్నలిస్ట్‌కు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘మంత్రిగా పనికిరారు.. సినీ నటి కావచ్చు..’ మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యేపై కేసు
Veena George

Kerala Health Minister Veena George: రాజకీయ విమర్శలు చేసేటప్పుడు నేరు కాస్త అదుపులో పెట్టుకోవాలి.. నోరు జారి ఆ తర్వాత నాలుక కరుచుకున్నా ప్రయోజనం ఉండదు. కరోనా కట్టడిలో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వైఫల్యాన్ని ఎండగట్టిన ఆ రాష్ట్ర రాజకీయ నేత ఒకరు.. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలతో పీకల్లోతు వివాదంలో కూరుకుపోయారు. మంత్రి వీణా జార్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జిపై కేసు నమోదయ్యింది. కేరళలో కరోనా కేసుల ఉధృతిపై పీసీ జార్జి ఓ సీనియర్ జర్నలిస్ట్‌కు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జినుద్దేశించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె పనికిరారని అభిప్రాయపడ్డారు. సినీ నటి అయ్యేందుకు మాత్రమే ఆమెకు అర్హతలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన అసిస్టెంట్‌ను రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి చేశారని వ్యాఖ్యానించారు. మంత్రి వీణా పరువుకు భంగం కలిగించేలా మరిన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఆడియో రికార్డును జర్నలిస్టు తన పత్రికకు సంబంధించి ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. మహిళా మంత్రినుద్దేశించి పీసీ జార్జి చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా సంఘాలు అభ్యంతరం తెలిపాయి. మాజీ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి పరువుకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీ జార్జిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కేరళ హైకోర్టు న్యాయవాది బీహెచ్ మన్సూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేరళ డీజీపీ ఆదేశాల మేరకు ఆయనపై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 509(మహిళ పరువుకు భంగం కలిగించడం), 354 ఏ, కేపీ యాక్ట్ 124 తదితర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

మంత్రిపై పీసీ జార్జి చేసిన అనుచిత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు సీనియర్ జర్నలిస్ట్ నందకుమార్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read..

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

TTD: సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దు.. టీటీడీ వెబ్‌సైట్‌పై వివరణ ఇచ్చిన టీటీడీ..

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu