Om Birla: కర్ణాటక ఉభయ సభలనుద్దేశించి లోక్‌సభ స్పీకర్ ప్రసంగం.. బహిష్కరించిన కాంగ్రెస్
Lok Sabha Speaker Om Birla: కర్ణాటక ఉభయ సభలనుద్దేశించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రసంగించారు. అయితే ఇది ప్రోటోకాల్‌కు విరుద్ధమంటూ ఆయన ప్రసంగాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది.
Lok Sabha Speaker Om Birla: కర్ణాటక ఉభయ సభలనుద్దేశించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రసంగించారు. అయితే ఇది ప్రోటోకాల్‌కు విరుద్ధమంటూ ఆయన ప్రసంగాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. అసెంబ్లీలో ప్రసంగించేందుకు లోక్‌సభ స్పీకర్‌ను బీజేపీ సర్కారు ఆహ్వానించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఇది సరైన సాంప్రదాయం కాదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ పేర్కొన్నారు. సహజంగా రాష్ట్రపతి, గవర్నర్ మాత్రమే అసెంబ్లీ ఉపసభలనుద్దేశించి ప్రసంగించ వచ్చని.. అయితే లోక్‌సభ స్పీకర్ ప్రసంగించే సాంప్రదాయం లేదన్నారు. కర్ణాటక చరిత్రలో ఇప్పటి వరకు లోక్‌సభ స్పీకర్.. ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన సందర్భం లేదన్నారు. రాజకీయ ఎజెండా కోసం విధాన సభను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. అందుకే లోక్‌సభ స్పీకర్ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు స్పష్టంచేశారు. ఇది అనవసరమైన కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తప్పుబట్టారు. లోక్‌సభ స్పీకర్ పలు అసెంబ్లీల్లో ప్రసంగాలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ సాంప్రదాయం ఉందన్నారు. అయితే ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్‌కు ఎప్పుడూ నమ్మకం లేదని..అందుకే లోక్‌సభ స్పీకర్ ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని బహిష్కరించిందని మండిపడ్డారు.
కాగా కర్ణాటక అసెంబ్లీలో 2020 సంవత్సరానికి గాను ఉత్తమ శాసనసభ్యుడి అవార్డును ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రదానం చేశారు. 10 రోజులు సాగిన అసెంబ్లీ సెషన్ శుక్రవారంతో ముగిశాయి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు గుర్రపు బండ్లపై సభకు చేరుకుని.. ఉదయం సెషన్‌కు మాత్రం హాజరయ్యారు.
ప్రజా సమస్యలపై సభలో చర్చించేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. కేవలం బిల్లులకు ఆమోదం పొందేందుకే బీజేపీ.. అసెంబ్లీ సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై కాంగ్రెస్ వీధి పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టంచేశారు.
కర్ణాటక ఉభయసభలనుద్దేశించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం..
Also Read..
AP Weather Report: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన