AP Weather Report: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి తీవ్ర అల్పపీడనం వాయుగుండం
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. తదుపరి 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనించనుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమబెంగాల్-ఒడిశా- ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వెేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.
రాగల 3 రోజుల వాతావరణ సమాచారం:-
శనివారం(25-09-2021):- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం.
ఆదివారం(26-09-2021):-
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
సోమవారం(27-09-2021):-
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం.
Also Read: జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసిన సీఎం జగన్.. లిస్ట్ ఇదిగో
ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. వరుణ్ తేజ్ మూవీలో నటించింది.. గుర్తించారా