CM KCR-CM Jagan: ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఒకే వేదికను పంచుకోనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 25న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు. 26న విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. అయితే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ సైతం కన్ఫామ్ అయింది. శనివారం మధ్యాహ్నం ఆయన హస్తినకు వెళతారు. ఆయన పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు..
చాలా రోజుల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. నీటి పంచాయితీ నేపథ్యంలో వారిద్దరూ ఒకే భేటీకి హాజరవడం ఆసక్తిగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన రెండు రోజులు అక్కడే ఉంటారు. ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి ఇద్దరు సీఎంలు హాజరవుతారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశం నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ నేపథ్యంలో కేసీఆర్, జగన్ ఒకే సమావేశానికి హాజరుకానుండటం ఆసక్తిగా మారింది. తెలంగాణపై ఏపీ, ఆ రాష్ట్రంపై తెలంగాణ ఇప్పటికీ ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంలు ఒకే మీటింగ్‌కు వెళ్లడం ఇంట్రస్టింగ్ పాయింట్.
సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇలా..
మరోవైపు సీఎం కేసీఆర్ శనివారం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలుస్తారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్ట్‌లను బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌పై చర్చిస్తారు. బోర్డుల పరిధిలోకి తెచ్చే గడువును పెంచాలని తెలంగాణ కోరుతోంది. ఈ నెల మొదట్లోనే షెకావత్‌తో భేటీ అయ్యారు కేసీఆర్. అయినా గడువును పెంచలేదు. దీంతో ఢిల్లీ టూర్‌లో మరోసారి కేంద్రమంత్రిని కలిసి చర్చిస్తారు ముఖ్యమంత్రి.
ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..
CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..