Viral Video: సింహాన్ని బెదరగొట్టిన తాబేలు.. చుక్కలు చూపిందిగా.. అద్భుతమైన వీడియో మీకోసమే.!

Lion Viral Video: అడవికి రాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు గర్జన దూరం నుంచి వినబడితే చాలు.. మిగతా జంతువులన్నీ కూడా పరుగులు పెడతాయి..

Viral Video: సింహాన్ని బెదరగొట్టిన తాబేలు.. చుక్కలు చూపిందిగా.. అద్భుతమైన వీడియో మీకోసమే.!
Lion
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 24, 2021 | 1:28 PM

అడవికి రాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు గర్జన దూరం నుంచి వినబడితే చాలు.. మిగతా జంతువులన్నీ కూడా పరుగులు పెడతాయి. అంతటి బలశాలి అయిన సింహంతో ఏ జంతువూ పోరుకు సిద్దమవ్వదు. కానీ ఇక్కడొక తాబేలు సింహానికి ఎదురెళ్లింది. ఏంటి తాబేలు, సింహం మధ్య యుద్ధం అని అనుకుంటున్నారా.? అయితే ఈ వీడియో చూడండి మీకు అసలు విషయం అర్ధమవుతుంది. తాబేలు ధైర్యాన్ని చూసి మీరు కూడా మెచ్చుకుంటారు. లేట్ ఎందుకు వీడియోపై ఓ లుక్కేయండి.

సుమారు29-సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ‘hayate_vahsh58’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ”తాబేలుకు ఏమైనా పిచ్చి పట్టిందా.? సింహాన్ని ఇబ్బంది పెడుతోంది.!” అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ”సింహంతోనే పరాచకాలు ఆడుతోందంటూ” మరొకరు కామెంట్ చేశారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ సింహం నది ఒడ్డున నీరు తాగుతున్నట్లు మీరు చూడవచ్చు. అకస్మాత్తుగా ఎక్కడ నుంచో ఓ తాబేలు దాని దగ్గరకు వస్తుంది. ఎంచక్కా నీళ్లు తాగుతున్న సింహాన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా.. దాన్ని బెదరగొట్టింది. తాబేలును తప్పించుకుని సింహం పక్కకి వెళ్లి నీళ్లు తాగాలన్నా కుదరలేదు. సింహం ఎక్కడికి వెళ్తే.. తాబేలు అక్కడికి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ అద్భుతమైన వీడియోను నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. వరుసపెట్టి కామెంట్స్, రీ-షేర్లతో హోరెత్తిస్తున్నారు. మీరో ఒకసారి ఆ వీడియోను చూసేయండి..

Also Read:

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఫ్యూజులు ఔట్.. వీడియో చూస్తే షాకవుతారు!

ఒకే మ్యాచ్‌లో అన్నదమ్ముల విధ్వంసం.. ఒకరు అర్ధ శతకం, మరొకరు డబుల్ సెంచరీ.. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే.!

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!