Viral Video: గొయ్యిలో దాక్కున్న అడవి పందిని వేటాడిన చిరుత.. వేటను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

Leopard Viral Video: అడవిలో నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతీ రోజూ ''డూ ఆర్ డై'' సిట్యువేషన్ అని చెప్పాలి. సాధు జంతువులు..

Viral Video: గొయ్యిలో దాక్కున్న అడవి పందిని వేటాడిన చిరుత.. వేటను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!
Cheetah
Follow us

|

Updated on: Sep 25, 2021 | 9:18 AM

అడవిలో నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతీ రోజూ ”డూ ఆర్ డై” సిట్యువేషన్ అని చెప్పాలి. సాధు జంతువులు.. క్రూర జంతువులకు దొరక్కుండా తమ చురుకుదనాన్ని, వేగాన్ని ఆచరణలో పెట్టాలి. అలాగే క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు వేటను కొనసాగిస్తుండాలి. ఇదే అడవి నియమం. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ జీవన పోరాటంలో.. ఎప్పుడు.? ఏ జంతువు.? తమ ప్రాణాలు కోల్పోతుందో ఎవరూ చెప్పలేరు. చాలా సురక్షితమైన చోటులో ఉన్నామని అనుకున్న జంతువులు కూడా కొన్నిసార్లు రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరుత.. సింహం, పులికి ఏమాత్రం తీసిపోదు. దాని వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుత తన ఎరను ఎంచుకుంటే.. అది తప్పించుకోకుండా క్షణాల్లో వేటాడి మట్టుబెడుతుంది. సహజంగానే చిరుత వేట భయానకంగా ఉంటుంది. అలాంటిది ఆ చిరుత ఆకలి మీదుంటే.. ఇంకేంటి దండయాత్రే అని చెప్పాలి. ఓ ఆకలి మీదున్న చిరుత.. గొయ్యిలో దాక్కున్న అడవి పందిని బయటికి లాగి మరీ చంపుతుంది. మీరు వైరల్ అవుతున్న వీడియోలో ఈ దృశ్యాలను చూడవచ్చు.

వేటాడేటప్పుడు చిరుత కళ్లను చూస్తే.. అది ఎంతలా కసి మీద తన వేటను కొనసాగించిందో మీకు అర్ధమవుతుంది. ఏది ఏమైనా సురక్షితంగా ఉన్నాననుకున్న అడవి పంది తన ప్రాణాలను పోగొట్టుకుంది. ఇక ఇదంతా కూడా నమీబియాలోని అడవుల్లో జరిగింది. ఈ భయానక వేటకు సంబంధించిన వీడియోను ‘Big Cats Namibia’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

Also Read:

కోహ్లీ సహచరుడు లైన్ వేసిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు!

25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న భవనం తలుపులు.. ఓపెన్ చేసి చూడగా ఊహించని షాక్.!

సింహాన్ని బెదరగొట్టిన తాబేలు.. చుక్కలు చూపిందిగా.. అద్భుతమైన వీడియో మీకోసమే.!