Saree Controversy: చీరకట్టుకున్నందుకు మహిళకు అవమానం.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్

Delhi Saree Controversy: చీర కట్టుకుని వచ్చిన మహిళకు ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు లోపలికి అనుమతి నిరాకరించడం వివాదాస్పదమయ్యింది.

Saree Controversy: చీరకట్టుకున్నందుకు మహిళకు అవమానం.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్
Delhi Restaurant Saree Row
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 24, 2021 | 7:56 PM

Delhi Saree Controversy: చీర కట్టుకుని వచ్చిన మహిళకు ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు లోపలికి అనుమతి నిరాకరించడం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఆదివారంనాడు తనకు ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన వీడియోను బాధిత మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్మార్ట్ డ్రెస్ కాదంటూ చీరకట్టుతో వచ్చిన ఆ మహిళను రెస్టారెంట్ సిబ్బంది లోనుకి అనుమతి లేదని చెబుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది.  రెస్టారెంట్ నిర్వాకంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. భారత సాంప్రదాయంలో భాగమైన చీరకట్టును అవమానించిన రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమయ్యింది.

ఈ ఘటనపై ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్(NCW) కూడా సీరియస్ అయ్యింది. చీరకట్టుకుని వచ్చినందుకు మహిళకు ప్రవేశాన్ని నిరాకరించిన రెస్టారెంట్ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ రెస్టారెంట్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. రెస్టారెంట్ సిబ్బంది ప్రవర్తన, డ్రెస్సింగ్‌ కోడ్‌కు సంబంధించి రెస్టారెంట్ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహిళా కమిషన్ పేర్కొంది.

చీరకట్టుకుని వచ్చినందుకు మహిళకు అనుమతి నిరాకరించిన రెస్టారెంట్ సిబ్బంది..

Also Read..

Global Warming: షాకింగ్.. మాంసం..పాలు కూడా గ్లోబల్ వార్మింగ్‌కు కారణాలు.. ఎలాగంటే..?

ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఒకే వేదికను పంచుకోనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు..