Liger Movie: లైగర్ క్లైమాక్స్‌లో మైక్ టైసన్.. ఇక పంచ్‌లు మామూలుగా ఉండవుగా..!
Liger Movie Update: విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్’.
Liger Movie Update: విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్‌కి తెలుగుతో పాటు హిందీలోనూ మంచి పాపులారిటీ ఉండడంతో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కమ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్‌ని పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి మరొక అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమా క్లైమాక్స్‌లో బాక్సింగ్‌లో ఏడుసార్లు ప్రపంచ చాంఫియన్‌గా నిలిచిన మాజీ ఆటగాడు మైక్ టైసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా మైక్ టైసన్ నటిస్తున్నాడంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. క్లైమాక్స్‌లో టైసన్ తన పంచ్‌లతో అలరించనున్నారు. మిక్స్‌డ్ మార్షియల్ ఆర్ట్స్ ఫైటర్ పాత్రలో విజయ్ దేవరకొండ తన ప్రతాపం చూపనున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి ఈ మూవీ విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ సినిమా కోసం అయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ నుంచి హిట్ సినిమా రాలేదు. కాగా లైగర్ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌కు తల్లిగా ఆమె నటిస్తున్నారని టాక్. ఇంకా రోనిత్ రాయ్, అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 2019లో ఇస్మార్ట్ శంకర్ విజయం తరువాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.