15 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ.. బౌలర్లపై బౌండరీలతో దాడి.. అమెరికాలో అలజడి రేపిన ఇండియన్ ప్లేయర్
Unmukt Chand: అమెరికా ఇప్పటికీ క్రికెట్‌లో అభివృద్ధి చెందుతున్న దేశం. అయితే, ఈ దేశం కూడా టీ20 థ్రిల్‌ను అనుభవించడం ప్రారంభించింది.
Unmukt Chand: అమెరికా ఇప్పటికీ క్రికెట్‌లో అభివృద్ధి చెందుతున్న దేశం. అయితే, ఈ దేశం కూడా టీ20 థ్రిల్‌ను అనుభవించడం ప్రారంభించింది. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల క్రికెటర్లు అక్కడికి వెళ్లి ఆడుతుండడంతో అమెరికా పొట్టి క్రికెట్‌లోని మజాను ఆస్వాదిస్తోంది. తమ తమ దేశాల్లో అవకాశాలు లభించని ఆటగాళ్లు, అమెరికన్ పిచ్‌లను తమ క్రికెట్ కార్యాలయంగా చేసుకుంటున్నారు. వీరిలో భారతదేశ ప్లేయర్ కూడా ఉన్నాడు. ఆయనే ఉన్మక్త్ చంద్. అక్కడ జరుగుతున్న మైనర్ క్రికెట్ లీగ్‌లో మారణకాండ సృష్టించాడు. తన బ్యాటింగ్‌తో బౌలర్లపై దాడికి దిగి, పరుగులు తుఫాన్‌ను కురిపించాడు. ప్రత్యర్థి జట్టులోని ప్రతీ బౌలర్‌ను చీల్చి చెండాడాడు. 20 ఓవర్ల ఆటలో కేవలం 22 బంతుల్లోనే 102 పరుగులు చేసి పలు రికార్డులు నెలకొల్పాడు.
అమెరికాలో జరుగుతున్న మైనర్ లీగ్ క్రికెట్‌లో ఆస్టిన్ అథ్లెటిక్స్ వర్సెస్ సిల్కెన్ వ్యాలీ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఉన్మక్త్ చంద్ సిల్కెన్ వ్యాలీ స్ట్రైకర్స్‌లో భాగంగా ఆడాడు. ఆస్టిన్ అథ్లెటిక్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లకు 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉన్ముక్త్ చంద్ టీం.. 3 బంతులు మిగిలి ఉండగానే, 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
అమెరికాపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు ఉన్ముక్త్ చంద్ ఈ మ్యాచ్‌లో 191.30 స్ట్రైక్ రేట్ వద్ద సెంచరీ సాధించాడు. చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచిన ఉన్మక్త్.. 69 బంతుల్లో 132 పరుగులు చేశాడు. కానీ, 20 ఓవర్ల ఆటలో కేవలం 22 బంతుల్లో బౌండరీల నుంచి 102 పరుగులు చేశాడు. ఉన్మక్త్ చంద్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.
14 టీ 20 లు, 534 పరుగులు, 1 సెంచరీ ఉన్మక్త్ చంద్ తుఫాను ఇన్నింగ్స్ కారణంగా, సిల్కెన్ వ్యాలీ స్ట్రైకర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిల్కెన్ వ్యాలీ స్ట్రైకర్స్‌లో చేరిన తర్వాత యూఎస్‌లో అతనికి ఇది 14 వ మ్యాచ్. ఈ మ్యాచుల్లో 434 బంతులను ఎదుర్కొన్నాడు. 53.20 సగటు, 122.58 స్ట్రైక్ రేట్‌తో 534 పరుగులు చేశాడు. ఈ 14 మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి 18 సిక్సర్లు, 52 ఫోర్లు రాలాయి.
Unmukt Chand scored unbeaten 132 runs from 69 balls including 15 fours and 7 sixes for Silicon Valley Strikers in Minor League Cricket in USA.pic.twitter.com/8iKuoKmJmx
— Johns. (@CricCrazyJohns) September 27, 2021
Also Read: IPL 2021 SRH vs RR Live: తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. లీవిస్ (6) ఔట్.. స్కోర్ 11/1