IPL 2021 SRH vs RR Highlights: 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం.. అర్థసెంచరీలతో ఆకట్టుకున్న రాయ్, విలియమ్సన్
SRH vs RR Highlights in Telugu: 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది. హైదరాబాద్ తరపున కేన్ విలియమ్సన్ (51), జాన్సన్ రాయ్ (60)పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించారు.
SRH vs RR Highlights in Telugu: ఐపీఎల్ 2021లో భాగంగా 40 వ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తలపడిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది. హైదరాబాద్ తరపున కేన్ విలియమ్సన్ (51), జాన్సన్ రాయ్ (60)పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఐపీఎల్ 2021లో భాగంగా 40 వ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తలపడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టీం బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ -2021 లో ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా దూరంలో నిలిచింది. అయితే ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అనేక టీంల సమీకరణాలను ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించనుంది. దీంతో సోమవారం జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టీం హైదరాబాద్‌పై ఎంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. రాజస్థాన్ ప్రస్తుతం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పాయింట్లను మాత్రమే సాధించింది.
ఫేజ్ -2 లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. పంజాబ్‌పై యువ ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగి చివరి ఓవర్‌లో రాజస్థాన్‌కు విజయం సాధించాడు. అయితే ఢిల్లీపై జట్టు మాత్రం ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. మరోవైపు హైదరాబాద్ ఈ దశలో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కీపర్, కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తఫిజుర్ రహమాన్
LIVE Cricket Score & Updates
-
ఎట్టకేలకు గెలిచిన హైదరాబాద్
ఐపీఎల్ 2021లో భాగంగా 40 వ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తలపడిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది.
-
మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
ప్రియం గ్రాగ్ (0) రూపంలో హైదరాబాద్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది.
-
-
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
రాయ్ (60 పరుగులు, 42 బంతులు, 8 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో హైదరాబాద్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. చేతన్ సకారియా బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోర్ 114/2 గా ఉంది.
-
రాయ్ అర్థ సెంచరీ
జాన్సన్ రాయ్ వరుసగా బౌండరీలో దాడి చేస్తూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అరంగేట్రంలోనే అర్థ సెంచరీ బాదేశాడు. రాహుల్ తెవాటియా వేసిన 10 ఓవర్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో మొత్తం 21 పరుగులు రాబట్టుకున్నాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
సాహా (18) రూపంలో హైదరాబాద్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. లామ్రోర్ బౌలింగ్‌లో శాంసన్ స్టంపింగ్‌తో పెవిలియన్ చేరాడు.
-
-
వరుస బౌండరీలు బాదిన రాయ్
జాన్సన్ రాయ్ 5 ఓవర్లోనూ వరుసగా మూడు ఫోర్లు బాది బౌలర్ క్రిస్ మోరిస్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 18 పరుగులు పిండుకున్నాడు. గత ఓవర్ నుంచి ప్రతీ ఓవర్‌లో మూడు ఫోర్లు బాది బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
-
వరుస బౌండరీలు బాదిన రాయ్
జాన్సన్ రాయ్ 4 ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాది బౌలర్ ముస్తఫిజుర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు పిండుకున్నాడు.
-
3 ఓవర్లకు స్కోర్ 26/0
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో సాహా 18, రాయ్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మొదలైన హైదరాబాద్ బ్యాటింగ్
165 పరుగుల లక్ష్యంతో హైదరాబాద్ టీం బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్లుగా రాయ్, సాహా క్రీజులోకి వచ్చారు.
-
హైదరాబాద్ టార్గెట్ 165
రాజస్థాన్ రాయల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు సాధించింది. దీంతో హైదరాబాద్ ముందు 165 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
-
18 ఓవర్లకు స్కోర్ 153/3
రాజస్థాన్ రాయల్స్ టీం 18 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్ 78, మహిపాల్ 25 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శాంసన్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ కేవలం 42 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సులతో అర్థ సెంచరీ సాధించాడు. 134 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్‌ఆర్ టీం 15.4 ఓవర్లు ముగిసే సరికి 127/3 పరుగులు చేసింది.
-
14 ఓవర్లకు స్కోర్ 102/3
రాజస్థాన్ రాయల్స్ టీం 14 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్ 38, మహిపాల్ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
లివింగ్‌స్టోన్ (4) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
జైస్వాల్ (36) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
-
8 ఓవర్లకు స్కోర్ 60/1
రాజస్థాన్ రాయల్స్ టీం 8 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్ 30, శాంసన్ 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
5 ఓవర్లకు స్కోర్ 37/1
రాజస్థాన్ రాయల్స్ టీం 5 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్ 23, శాంసన్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
ఈవిన్ లీవిస్ (6) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో అబ్దుల్ షమద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
ప్లేయింగ్ ఎలెవన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కీపర్, కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తఫిజుర్ రహమాన్
-
టాస్ గెలిచిన రాజస్థాన్
కీలక మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తొలుత బౌలింగ్ చేయనుంది.
-
మ్యాచ్‌కు ముందు లెజెండ్ల ముచ్చట్లు
Pre-match chat between the legends ? ?#VIVOIPL #SRHvRR pic.twitter.com/pjOvVKrpEh
— IndianPremierLeague (@IPL) September 27, 2021
-
హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ పోరుకు అంతా సిద్ధం
Hello & welcome from Dubai for Match 40 of the #VIVOIPL ?
The Kane Williamson-led @SunRisers square off against @IamSanjuSamson‘s @rajasthanroyals. ? ? #SRHvRR
Which team will come out on top tonight? ? ? pic.twitter.com/WDaGiDKEWY
— IndianPremierLeague (@IPL) September 27, 2021
Published On - Sep 27,2021 6:39 PM