- Telugu News Photo Gallery Cricket photos Australian Women Cricket Team Player Alyssa Healy breaks MS Dhoni T20I wicketkeeping record On this day Telugu Cricket News
T20 Cricket: ధోని ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ ఉమెన్ ప్లేయర్.. టీ20 ఫార్మాట్‌కే క్వీన్‌గా మారింది.. ఆమె ఎవరంటే?
Australian Women Cricket Team: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అలిస్సా హీలీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్లలో ఒకరు. మహేంద్ర సింగ్ ధోనీని కూడా ఆమె అధిగమించారు.
Updated on: Sep 27, 2021 | 5:47 PM

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అలిస్సా హీలీ.. గత సంవత్సరం ఇదే రోజున ఓ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రికార్డుతో ఆమె భారత లెజెండ్రీ స్టార్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా అధిగమించింది.

గత ఏడాది ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచుల్లో ఎక్కువ వికెట్లు తీసిన కీపర్‌గా హీలీ నిలిచింది. పురుషుల, మహిళల టీ 20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహిళగా ఆమె నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు ధోని పేరు మీద ఉంది.

పురుషుల క్రికెట్‌లో ఎంఎస్ ధోని టీ20 ఫార్మాట్‌లో వికెట్ కీపర్‌గా 91 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో హీలీ తన 92 వ వికెట్‌ను టీ20 ఫార్మాట్‌లో పూర్తి చేసింది. ఇందులో 42 క్యాచ్‌లు, 50 స్టంప్‌లు ఉన్నాయి.

మహేంద్ర సింగ్ ధోని గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ, హీలీ రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 118 మ్యాచ్‌ల్లో 97 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చింది. ఇందులో 46 క్యాచ్‌లు, 51 స్టంపింగ్‌లు ఉన్నాయి.

అదే సమయంలో 118 టీ20 మ్యాచ్‌లలో 103 ఇన్నింగ్స్‌లలో 2121 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె అత్యధిక స్కోరు 148 నాటౌట్‌గా నమోదైంది. 82 వన్డేలలో 71 ఇన్నింగ్స్‌ల్లో 33.98 సగటుతో 2039 పరుగులు చేసింది. ఇందులో మూడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.





























