- Telugu News Photo Gallery Cricket photos Who will win Sunrisers Hyderabad vs Rajasthan Royals IPL Match Today Prediction Previous Match Stats 27 09 2021 in Telugu Head to head Records and Playing XI
SRH vs RR IPL 2021 Records: పోటీలో ఇరు జట్లు సమమే.. నేడు హోరాహోరీ పోరు గ్యారెంటీ.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
SRH Vs RR IPL 2021 Match Prediction, Head to Head Records: ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తలపడనుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 14 సార్లు తలపడ్డాయి.
Updated on: Sep 27, 2021 | 2:40 PM

ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందో చెప్పడం కష్టం. అయితే విజయం కోసం ఈ రెండు జట్ల మధ్య భీకర పోరాటం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో ఎవరి విజయాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఐపీఎల్ 2021లో రెండవ దశలో నేడు రాజస్థాన్ రాయల్స్ టీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 15 వ సారి తలపడనున్నాయి. ఇంతకు ముందు ఆడిన 14 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ టీం 7, సన్‌రైజర్స్ 7 విజయాలతో సమానంగా నిలిచాయి. ఐపీఎల్ 2021 లో తొలి దశలో రాజస్థాన్ గత పోటీలో హైదరాబాద్‌ను ఓడించింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఈరోజు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది.

దుబాయ్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచారు. అంటే ఈ రోజు పోటీ కూడా రసవత్తరంగా జరగనుందని తెలుస్తోంది. గత 5 మ్యాచ్‌లలో రాజస్థాన్ టీం 3 మ్యాచులు, హైదరాబాద్ టీం 2 మ్యాచుల్లో గెలిచింది. ఈరోజు హైదరాబాద్ గెలిస్తే చెరో మూడు విజయాలతో సమనంగా ఉండనుంది.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI అంచనా : యశస్వి జైస్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, సంజు శాంసన్ (కీపర్, కెప్టెన్), డేవిడ్ మిల్లర్/ఎవిన్ లూయిస్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, తబరైజ్ షమ్సి/క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రహమాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: డేవిడ్ వార్నర్/జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్/విరాట్ సింగ్/ప్రియం గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్.





























