IPL 2021, SRH vs RR: హైదరాబాద్ టార్గెట్ 165.. 143 స్ట్రైక్‌రేట్‌తో హాఫ్ సెంచరీ చేసిన శాంసన్
IPL 2021, SRH vs RR: రాజస్థాన్ రాయల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు సాధించింది. దీంతో హైదరాబాద్ ముందు 165 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
IPL 2021, SRH vs RR: ఐపీఎల్ 2021లో భాగంగా 40 వ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తలపడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టీం బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈవిన్ లీవిస్ (6) రూపంలో తొలి వికెట్‌ను తర్వగా కోల్పోయిన రాజస్థాన్ టీం.. జైస్వాల్, శాంసన్ సమయానుకూలంగా ఆడుతూ, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు తరలిస్తూ స్కోర్ బోర్డును పెంచేందుకు సహాయపడ్డారు. దూకుడు మీదున్న జైస్వాల్(36 పరుగులు, 23 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్)ను సందీప్ శర్మ పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ (4) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. మరోసారి మహిపాల్ లామ్రోర్(29)తో కీలకమైన భాగస్వామ్యాన్ని శాంసన్ నెలకొల్పాడు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ కేవలం 57 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు సాధించి, హైదరాబాద్ ముందు భారీ స్కోర్ ఉంచేందుకు సహాయపడ్డాడు. 143 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. చివరి ఓవర్లలో సిద్ధార్ధ్ కౌల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లో కౌల్ 2 వికెట్లు, సందీస్ శర్మ, భువనేశ్వర్ శర్మ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
Innings Break!
A superb knock of 82 from the #RR Captain propels them to a total of 164/5 on the board.#SRH chase coming up shortly.
Scorecard – https://t.co/3wrjO6J87h #SRHvRR #VIVOIPL pic.twitter.com/ajSu25YkEq
— IndianPremierLeague (@IPL) September 27, 2021
Also Read: 15 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ.. బౌలర్లపై బౌండరీలతో దాడి.. అమెరికాలో అలజడి రేపిన ఇండియన్ ప్లేయర్
IPL 2021 SRH vs RR Live: హైదరాబాద్ టార్గెట్ 165.. అర్థశతకంతో ఆకట్టుకున్న ఆర్‌ఆర్ కెప్టెన్ శాంసన్