Exams postponed: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా!

రేపు, ఎల్లుండి కూడా భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Exams postponed: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా!
Exam
Follow us
Balaraju Goud

| Edited By: Ravi Kiran

Updated on: Sep 27, 2021 | 9:26 PM

Exams Postponed in Telangana: గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ‌వ్యాప్తంగా కుండపోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎడ‌తెర‌పి లేకుండా వ‌ర్షాలతో లోతట్లు ప్రాంతాలు నీట మునిగాయి. మ‌రోవైపు రేపు, ఎల్లుండి కూడా భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28, 29 తేదీల్లో (రేపు, ఎల్లుండి) రాష్ట్రంలో జ‌రుగాల్సిన‌ ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వాయిదా ప‌డిన ప‌రీక్షల‌ను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తూ జేన్‌టీయుూ, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. తదుపరి పరీక్షల షెడ్యూల్‌లో త్వరలోనే ప్రకటిస్తామన్నారు..

Exams Postphoned

Exams Postphoned

Exams

Read Also…. Hyderabad Rains Live Updates Video: హెచ్చరిక .. ఎవరూ బయటకు రావొద్దు..! చెరువుల్లా మారిన సిటీ రోడ్లు..(వీడియో)