Telangana: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు..

Telangana Government: గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్...

Telangana: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు..
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 28, 2021 | 6:24 AM

గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు ఇవాళ (సెప్టెంబర్ 28వ తేదీన )సెలవు ప్రకటించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కీలక ప్రకటన జారీ చేశారు. అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీసు, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయితీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా..

గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణ అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జరగాల్సిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే రేపు జరగాల్సిన బీటెక్, ఫార్మసీ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా జేఎన్టీయూ వెల్లడించింది. ఎల్లుండి జరగాల్సిన పరీక్షలు మాత్రం యధాతధంగా జరుగుతాయంది. మరోవైపు బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టును కూడా వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. దీనిని అక్టోబర్ 23న నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Also Read:

పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా? మన రూ. 2000 విలువ అక్కడెంతో తెలుసా?

కింగ్ కోబ్రా, రాకాసి బల్లి మధ్య భీకర పోరాటం.. చివరికి ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!

భార్యపై ప్రాంక్ వీడియో చేసిన భర్త.. వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం.. మీరూ ఓ లుక్కేయండి!