AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5: నామినేషన్స్ ప్రక్రియలో ప్రియపై లోబో రచ్చ.. విశ్వపై గొంతు చించుకుంటూ నటరాజ్ మాస్టర్.. ప్రోమో మామూలుగా లేదుగా!

బిగ్‌బాస్ సీజన్ 5 అంతా రచ్చ రచ్చగా నడుస్తోంది. 18 మంది కంటెంస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ ఇప్పుడు 15 మందికి చేరింది. మూడు వారాలుగా ఒక్కో వారం ఒక్కోరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటివరకూ సరయు, కార్తీకదీపం ఉమ, లహరి హౌస్ బయటకు వెళ్ళిపోయారు.

Bigg Boss 5: నామినేషన్స్ ప్రక్రియలో ప్రియపై లోబో రచ్చ.. విశ్వపై గొంతు చించుకుంటూ నటరాజ్ మాస్టర్.. ప్రోమో మామూలుగా లేదుగా!
Bigg Boss 5 Latest Promo
KVD Varma
|

Updated on: Sep 27, 2021 | 7:28 PM

Share

Bigg Boss 5: బిగ్‌బాస్ సీజన్ 5 అంతా రచ్చ రచ్చగా నడుస్తోంది. 18 మంది కంటెంస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ ఇప్పుడు 15 మందికి చేరింది. మూడు వారాలుగా ఒక్కో వారం ఒక్కోరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటివరకూ సరయు, కార్తీకదీపం ఉమ, లహరి హౌస్ బయటకు వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు నాలుగో ఎలిమినేషన్ ఎవరనేది ఈ వారం తేలాలి. దీనికోసం ఎలిమినేషన్ లో ఎవరు ఉంటారనే నామినేషన్ ప్రక్రియ సోమవారం అంటే ఈరోజు ప్రారంభం అవుతుంది. ప్రతి వారం నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కంటెంస్టెంట్స్ మధ్యలో విపరీతమైన హడావుడి ఉంటుంది. వారం అంతా ఎలా ఉన్నా.. ఈ ఒక్కరోజు మాత్రం ఒక్కోరి విశ్వరూపం కనిపిస్తుంది. వారి లోపల దాచుకున్న అన్ని భావాలను.. బయటకు కక్కేస్తారు. నామినేట్ చేసే సమయంలో ఎందుకు వారిని నామినేట్ చేయాలనేది చెప్పాలి. ఇక ఆ తంతు మినీ యుద్ధాన్ని సృష్టిస్తుంది. ప్రతివారం ఇలానే ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం భలే వినోదం దొరుకుతుంది. ఎందుకంటే, కంటెంస్టెంట్స్ నిజమైన రూపాలు ఈరోజు బయటపడతాయి. అదీకాకుండా.. వారం వారం మారే పరిస్థితుల్లో ఎవరు ఎలా మారుతున్నారనే దానికి ప్రతి సోమవారం ప్రత్యక్ష వీక్షణం దొరుకుతుంది. ఇక ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు కంటెంస్టెంట్స్ పై తమ అంచనాలు మార్చుకుంటూ వస్తారు. ఈ నేపధ్యంలో సోమవారం ఎవరు నామినేషన్స్ లో వస్తారనే ఉత్సుకత చూపిస్తారు. ఓటింగ్ కోసం సిద్ధం అయిపోతారు.

ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత గందరగోళంగా సాగినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే వదిలింది బిగ్ బాస్ టీం. ఆ ప్రోమోలో లోబో విపరీతమైన అల్లరి చేస్తూ కనిపించాడు. తన అరుపులతో హౌస్ అదిరిపోయింది. లోబో ఒకరకంగా విశ్వరూపం చూపించేశాడని చెప్పవచ్చు. అసలు ఏమి జరిగింది అనేది పూర్తి ఎపిసోడ్ లో చూడొచ్చు కానీ, ఈ ప్రోమోలో మాత్రం లోబోకు.. ప్రియకు మధ్యలో యుద్ధం జరిగినట్టు కనిపిస్తోంది. లోబో ప్రియను గట్టిగానే కడిగేస్తున్నట్టు తెలుస్తోంది. తన లవ్ స్టోరీ గురించి చెబితే ప్రియ అది సినిమా స్టోరీలా ఉందని ఎగతాళి చేసింది అంటూ ఏడుపు స్వరంతో ప్రియాతో చెబుతున్నాడు లోబో. దానికి ప్రియ ఎదో చెప్పబోయింది. అంతే.. లోబో రెచ్చిపోయాడు. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ప్రియ వైపుకు దూసుకు వెళ్ళడం ప్రోమోలో హైలైట్ అయింది. అదే సమయంలో ప్రియ గట్టిగా అరవకు అని చెబితే.. నేను అరుస్తాను అంటూ లోబో మరింత గట్టిగా అరుస్తూ గందరగోళం చేసేశాడు. ఇక రవి లోబో వద్దకు వెళ్లి అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు. రవిని పట్టుకుని లోబో భోరున ఏడ్చాడు. అసలు లోబో కామెడీ చేస్తాడని అందరూ అనుకుంటుంటే అంతకు మించి ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ చూపిస్తున్నాడు. అయితే, ఇది ప్రోమో కాబట్టి పూర్తిగా ఏమీ చెప్పలేం. ప్రియకు.. లోబోకు మధ్య జరిగిన ఘర్షణ హైలైట్ చేయడాన్ని బట్టి చూస్తె మాత్రం లోబో ప్రియను నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా లోబో అంత గింజుకుంటున్నాడు అంటే.. కచ్చితంగా లోబో ఈ వారం నామినేషన్స్ లో వచ్చేసి ఉంటాడనిపిస్తోంది.

ఈ లోబో ప్రియలను పక్కన పెడితే మరో ఇద్దరి మధ్య కూడా పెద్ద యుద్ధమే జరిగింది. విశ్వ.. నటరాజ్ మాస్టర్ మధ్య మాటలు గట్టిగానే పడ్డాయి. విశ్వ నటరాజ్ మాస్టర్ ను ఎదో అడుగుతున్నాడు. దానికి నటరాజ్ మాస్టర్ నేను నిన్ను బరాబర్ అంటాను అంటూ గొంతు చించేసుకోవడం కనిపించింది. ఏది ఏమైనా ఈరోజు రాత్రి ప్రసారం అయ్యే బిగ్ బాస్ సీజన్ 5 తాజా ఎపిసోడ్ రణరంగంలా మారిందనేది మాత్రం ప్రోమో చూస్తే క్లియర్ గా అర్ధం అవుతోంది. మరి ఆ ప్రోమోను మీరూ ఇక్కడ చూసేయవచ్చు.

Also Read:

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అరియానా.. ఏం చెప్పిందంటే..

Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్‏పై మండిపడుతున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..