Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్‏పై మండిపడుతున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బుల్లితెరపై బిగ్‍బాస్ రియాల్టీ షోను ఆసక్తిగా చూసేవారు ఎక్కువగానే ఉంటారు. ఇక హౌస్‏లో ఉండే కంటెస్టెంట్స్... మాట, ప్రవర్తన విధానాన్ని బట్టి వారిపై

Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్‏పై మండిపడుతున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Rj Kajal
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2021 | 5:00 PM

బుల్లితెరపై బిగ్‍బాస్ రియాల్టీ షోను ఆసక్తిగా చూసేవారు ఎక్కువగానే ఉంటారు. ఇక హౌస్‏లో ఉండే కంటెస్టెంట్స్… మాట, ప్రవర్తన విధానాన్ని బట్టి వారిపై ఒక అంచనాకు వస్తుంటారు ప్రేక్షకులు. ఇక బిగ్ బాస్ కొందరికి ప్లస్.. మరికొందరికి మైనస్. పాపులారిటీ ఉన్నవారికి తగ్గించవచ్చు.. అస్సలు జనాలకు తెలియని వారిని ఫేమస్ చేయడం కూడా ఒక్క బిగ్‏బాస్ షోకే సాధ్యం. ఇక ఇంట్లో మాట్లాడే ప్రతి మాటకు ప్రేక్షకులు నుంచి డిఫరెంట్ రియాక్షన్స్ వస్తుంటాయి. అక్కడ కంటెస్టెంట్స్ మాట్లాడే మాటలకు సోషల్ మీడియాలో కౌంటర్స్ రావడం..ట్రోల్స్ చేయడం చేస్తుంటారు. ముఖ్యంగా తమ గురించి ఇతర ఇంటి సభ్యులతో చర్చించే ముందు జాగ్రత్తగా చెప్పాల్సిందే. ఒక్క అబద్ధం చెప్పినా.. నెటిజన్స్ ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా ఆర్జే కాజల్‏పై నెటిజన్స్ తెగ మండిపడుతున్నారు.

షోలో మొదటి రోజు నుంచి ఆర్జే కాజల్.. ఎంతో ఉత్నాహంగా కనిపిస్తూ.. అందరి విషయాల్లో తలదురుస్తూ వస్తోంది. అయితే ఆమె ప్రవర్తన ఇంట్లో చాలా మందికి నచ్చడం లేదు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదురుస్తుందని అటు ఇంట్లో.. ఇటు బయట కూడా నెగిటివి పెరిగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్జే కాజల్ చేసిన కామెంట్స్ ఇంట్లో రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. వంటరాద.. అంట్లు తోమను అంటూ చెప్పడం ఇంట్లో వాళ్లకే కాదు.. జనాలకు కూడా నచ్చలేదు. ఇంట్లో మొదటి కెప్టెన్‏గా ఎన్నికైన సిరి.. డిపార్ట్మెంట్స్ వారిగా సభ్యులను పనులను నిర్ణయించింది. అయితే వెంటనే కాజల్.. తనకు కిచెన్ డిపార్ట్మెంట్ తప్పా మరే పని అయినా చేస్తాను అని.. తనకు వంట చేయడం రాదని బుకాయించింది. దీంతో వెంటనే శ్రీరామ చంద్ర ఆమెపై ఫైర్ అయ్యాడు. నేను కూడా ఇంట్లో ఏ పని చేయలేదు. కానీ ఇక్కడ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా నెటిజన్స్ ఆర్జే కాజల్‏ తన ఇన్‏స్టాలో ఉన్న వంట చేస్తున్న వీడియోలను బయటకు తీశారు. వంట రాదని చెప్పింది..కానీ ఇంట్లో మాత్రం వంట చేస్తుంది.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  Lahari Shari: తేనె కళ్ళతో కైపెకించే వయ్యారి.. లేత సోయగంతో కవ్వించే సొగసరి.. ఈ లహరి