Bigg Boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఈ కంటెస్టెంటే…ఎలిమినేషన్‌లో అదిరిపోయే ట్విస్ట్

బిగ్ బాస్ సీజన్ 5 మొదలై వారం రోజులు అయిపోయింది. హౌస్ లో కావాల్సినంత వినోదం పంచుతున్నారు కంటెస్టెంట్స్

Bigg Boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఈ కంటెస్టెంటే...ఎలిమినేషన్‌లో అదిరిపోయే ట్విస్ట్
Bigg Boss 5
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2021 | 4:56 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 మొదలై వారం రోజులు అయిపోయింది. హౌస్‌లో కావాల్సినంత వినోదం పంచుతున్నారు కంటెస్టెంట్స్. గత సీజన్స్‌లానే ఇంటిసభ్యుల మధ్య గొడవలు, అరుపులు, గోలలు. ఏడుపులు, నవ్వులు ఇలా సందడిగా బిగ్ బాస్ సాగుతుంది. ఇక హౌస్ లోకి వచ్చిన వలందరూ వీలైనన్ని ఎక్కువ రోజులు ఉండాలనే ట్రైచేస్తున్నారు. అయితే మొదటి వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సీజన్ 5 మొదటి కెప్టెన్ గా సిరి హనుమంత్ ఎంపిక అయ్యింది. ప్రస్తుతం నామినేషన్స్‌లో ఆరుగురిలో యాంకర్ రవి, హమీదాలు శనివారం నాటి ఎపిసోడ్‌లో సేవ్ అయ్యారు. ఇక మిగిలింది మానస్, సరయు, కాజల్, జెస్సీలు ఈ నలుగురిలో ఒకరు ఈ వారం బయటకు వెళ్లనున్నారు. వీరిలో ప్రేక్షకుల ఓటింగ్ బట్టి ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

అయితే ఈ ఓటింగ్‌లో సరయు జేసీల మధ్య  పోటీ జరిగిందని తెలుస్తుంది. అయితే నలుగురిలో కాజల్, మానస్‌ను సేవ్ చేసి జేసీ సరయూల్లో ఒకరు ఎలిమినేటి అవ్వనున్నారని తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎలిమినేషన్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉండనుందట. అంతా జేసీ ఎలిమినేటి అవుతాడేమో అనుకున్నా అనూహ్యంగా సరయు ఎలిమినేటి అవుతుందని అంటున్నారు. మొదటి వారం ఎలిమినేషన్ అయ్యేది సరయూనే అని అంటున్నారు. అయితే  ఆనీ మాస్టర్ విషయంలో జేసీ చేసిన రచ్చ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. జేసీ నామినేషన్ లో ఉన్న సమయంలో ఖచ్చితంగా అతడే ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. జేసీ జైలుకు వెళ్లడంతో ప్రేక్షకుల్లో సింపథీ ఓట్లు పెరిగాయని తెలుస్తుంది. దాంతో సరయు ఇంటి నుంచి బయటకు వెళ్ళాక తప్పదంటున్నారు. సరయు మొదటినుంచి హౌస్ లో చాలా హుషారుగా ఉంటూ ఆకట్టుకుంది. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున ఆమెను అడిగిమరీ బూతులు తిట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ టైంలో సరయు ఎలిమినేషన్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: లోబోని టార్గెట్ చేశారుగా.. ముళ్ళపంది అని రవి.. అతడికి మ్యాటర్ లేదని లహరి..

Allu Arjun: కాకినాడలో పుష్ఫరాజ్‌ సందడి.. వర్షం కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌. గ్యాప్‌లో ఎక్కడికి వెళ్లాడో తెలుసా.?

Bigg Boss 5 Telugu: బూతులు తిట్టమంటూ సరయుని కోరిన నాగ్.. ఇక అమ్మడు ఆగేనా..