Maa Elections 2021: కలసి మాట్లాడుకుందాం.. అభిప్రాయాల్ని పంచుకుందాం.. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విందు రాజకీయం..

మా ఎన్నికలు రసావత్రరంగా మారాయి. ముందుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు 'మా' ఎలక్షన్స్‌లో నిలబడుతున్నట్టు ప్రకటించారు.

Maa Elections 2021: కలసి మాట్లాడుకుందాం.. అభిప్రాయాల్ని పంచుకుందాం.. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విందు రాజకీయం..
Prakash Raj
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2021 | 10:39 AM

Maa Elections 2021: మా ఎన్నికలు రసావత్రరంగా మారాయి. ముందుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్‌లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. అనూహ్యంగా జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రత్యక్షం అయ్యారు. దాంతో బండ్ల గణేష్ రంగంలోకి దిగారు జీవిత పై  నేను పోటీ చేస్తా అంటూ ఆయన బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే పోటీలో అయిదుగురు కనిపిస్తున్నా.. రెండు ప్యానెల్స్ మధ్య ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్. కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పోటీ జరగలేదు. ఈసారి మాత్రం ఏకంగా అయిదుగురి పేర్లు తెరపైకి రావడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. కేవలం ఇగో… వీళ్ళని ఇంతవరకు తెచ్చింది. గత సంవత్సరం నుండే ప్రకాష్ రాజ్ పోటీకి ప్రణాళికలు రచించి, ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. అందరి కంటే ముందుగా తన ప్యానెల్‌ను ప్రకటించారు. ఆ తర్వాత మంచు విష్ణు రంగంలోకి దిగాడు. ఇప్పుడు బండ్ల గణేష్ ఎంటర్ అయ్యారు.

ఇదిలా ఉంటే ఎవరికీ వాళ్ళు అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టారు. మొన్న మధ్య నరేష్ తన మెంబర్స్ తో ఓ హోటల్ లో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా తన ప్యానల్ మెంబర్స్ తో విందు ఏర్పాటు చేశారు. “ప్రియమైన సిని”మా” బిడ్డలకు… కలసి మాట్లాడుకుందాం.. అభిప్రాయాల్ని పంచుకుందాం… ప్రతిష్ఠని, పటిష్టతని పెంచే దిశగా…మన లక్ష్యాలు మాట్లాడుకుందాం… మాట్లాడుకున్నాక సహపంక్తి భోజనం చేద్దాం.. అంటూ ఓ ఇన్విటేషన్ ను పంపారు. మరి వీలంతా కలిసి ఏం మాట్లాడుకుంటారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ముదురుతున్న మా వివాదం.. మోహన్ బాబుకు మాత్రమే చెప్తానంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

Bandla Ganesh: ఇండిపెండెంట్‌గా బరిలోకి బండ్ల.. స్పందించిన జీవిత, ప్రకాశ్‌రాజ్‌.. అంతుచిక్కని వ్యూహాలతో ఉత్కంఠ

Bandla Ganesh: ప్రకాష్‌రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్‌.. ప్యానల్‌ నుంచి తప్పుకొని బరిలోకి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?