Sai Dharam Tej Accident: చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవ భావం ఉన్న వ్యక్తి.. తేజ్ పై విజయ్ శాంతి ట్వీట్..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో మెగా అభిమానులలు ఆందోళనకు గురవుతున్నారు.

Sai Dharam Tej Accident: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో మెగా అభిమానులలు ఆందోళనకు గురవుతున్నారు. అతి వేగం కారణంగానే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలుపుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , నిహారిక, మెగాస్టార్ సతీమణి సురేఖ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆసుపత్రికి వెళ్లి తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు తేజ్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో లేడీ అమితాబ్ విజయ్ శాంతి కూడా సోషల్ మీడియా వేదికగా తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సాయి ధరమ్ తేజ్.. చక్కటి ప్రవర్తన సీనియర్ల పట్ల గౌరవభావం కలిగిన మంచి వ్యక్తి. మరియు ఆర్టిస్ట్. సత్వరమే కోలుకోవాలని.. విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..’ అని విజయశాంతి ట్వీట్ చేశారు. విజయ్ శాంతి తో పాటు మరికొంతమంది సెలబ్రేటీలుకూడా తేజ్ త్వరగా కోలుకొని తిరిగి సినిమాలు చేయాలనీ పోస్ట్ లు పెడుతున్నారు, అలాగే కొంత మంది మెగా అభిమానులు తేజ్ కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇన్సైడ్ బ్లీడింగ్ కానీ ఆర్గాన్ డామేజ్ కానీ ఏం కాలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తేజ్ చికిత్సకు స్పందిస్తున్నారు.
సాయి ధరమ్ తేజ
చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవ భావం కలిగిన మంచి వ్యక్తి, మరియు ఆర్టిస్ట్.
సత్వరమే కోలుకోవాలని, విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
Wishing Him a to Get Well Soon
విజయశాంతి pic.twitter.com/uAD3ISvE8W
— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 11, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :