Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal-Cm Jagan: ఆ ఆలోచన చేసిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌.. పొగడ్తల వర్షం కురిపించిన హీరో విశాల్.

Vishal-Cm Jagan: సినిమా టిక్‌ట్‌ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అధిక టికెట్‌...

Vishal-Cm Jagan: ఆ ఆలోచన చేసిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌.. పొగడ్తల వర్షం కురిపించిన హీరో విశాల్.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2021 | 8:18 AM

Vishal-Cm Jagan: సినిమా టిక్‌ట్‌ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అధిక టికెట్‌ రేట్లకు చెక్‌ పెడతూ, ప్రభుత్వ ఖాజానాకు గండి కొడుతున్న వారికి అడ్డుకట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో ఈ పోర్టల్‌ రూపొందించనున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందన్న ఆరోపణలపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని థియేటర్స్‌లో అమలవుతున్న టికెట్ల విక్రయ ప్రక్రియను నిశితంగా గమనించింది. ఆ తర్వాతే రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు అభినందనలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా హీరో విశాల్‌ ఏపీ సర్కారు నిర్ణయాన్ని అభినందించారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టిక్కెట్‌లను విక్రయించాలని ఆలోచించడం అభినందనీయం. ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేయాలని ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి హ్యాట్సాఫ్‌. ఇది ఇండస్ట్రీలోని వారు ఆహ్వానించదగ్గ విషయం. ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ విధానంతో వంద శాతం పారదర్శకత సాధ్యమవుతుంది’ అని విశాల్‌ చెప్పుకొచ్చారు. ఇదే విధానాన్ని తమిళనాడులోనూ ప్రవేశపెట్టాలని తాను తమిళనాడు ముఖ్యమంత్రి యం.కె. స్టాలిన్‌ని కోరాలనుకుంటున్నానని విశాల్‌ చెప్పుకొచ్చారు. ఈ విధానంతో థియేటర్స్‌ వసూళ్లు పూర్తి పారదర్శకంగా ఉంటాయని, ఇది ఇండస్ట్రీతో పాటు ప్రభుత్వానికి కూడా వరం అని పేర్కొన్నారు.

Also Read: Chinese Spare Parts: చైనా విడిభాగాల కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం

Chirutha: అనుకున్నట్లుగానే చిక్కింది.. ఫారెస్ట్ అధికారుల ప్లాన్ ఫలించింది.. బోన్‌లో పడిన చిరుతను..

టీమిండియా ఆల్ రౌండర్‌ కుటుంబంలో వివాదం.. సోదరి, భార్యల మధ్య చిచ్చు పెట్టిన కోవిడ్ -19 రూల్స్.. ఎందుకో తెలుసా?