టీమిండియా ఆల్ రౌండర్ కుటుంబంలో వివాదం.. సోదరి, భార్యల మధ్య చిచ్చు పెట్టిన కోవిడ్ -19 రూల్స్.. ఎందుకో తెలుసా?
Ravindra Jadeja: రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. రాజకీయాలలో చురుకుగా ఉంటారు. ఆమెకు తన భర్త పూర్తి మద్దతు ఉంది.
Ravindra Jadeja: భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా, ఆమె సోదరి నైనాబా జడేజా ప్రస్తుతం రాజకీయ పోరులో తలపడ్డారు. రివాబా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు. జడేజా సోదరి నైనాబా కాంగ్రెస్ సభ్యురాలు. గుజరాత్‌లో జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు నైనాబా ఇటీవల రివాబాపై నిప్పులు చెరిగారు. మరాఠీ న్యూస్ వెబ్‌సైట్ లోకమత్ నివేదిక ప్రకారం.. ఇటీవల చాలా మంది ప్రజలు గుంపుగా సమావేశమై కోవిడ్ నియమాలను ఉల్లంఘించిన ఒక కార్యక్రమంలో రివాబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రివాబా కూడా మాస్క్ ధరించలేదు.
కోవిడ్ -19 రూల్స్ పట్ల రివాబా అజాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్నందుకు నైనాబా విమర్శించారు. గుజరాత్‌లో కోవిడ్ మూడవ వేవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉన్నా.. అలా జరగలేదు. రివాబాకు తన భర్త మద్దతు ఉన్నందున జడేజా ఇంట్లో రాజకీయాలు కూడా వేడెక్కాయి. అయితే నయనబాకు తన తండ్రి, సోదరి మద్దతు లభించింది.
గతంలోనూ వివాదం కోవిడ్ నియమాల ఉల్లంఘన కారణంగా రివాబా వివాదాస్పదం కావడం ఇదే మొదటిసారి కాదు. ఆమె ఇంతకు ముందు కూడా వివాదాలలో చిక్కుకున్నారు. మాస్క్ ధరించకుండా ఆగస్టు 2020లోనూ ఓ సారి కనిపించింది. రాజ్‌కోట్‌లో తన కారును దిగి వెళ్తున్నప్పుడు ఆమె మాస్క్ లేకుండా కనిపించింది. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. బెంగళూరు మిర్రర్ ప్రకారం, రివాబాను మహిళా పోలీసులు అడ్డుకున్నప్పుడు, ఆమె వారితో వాదించింది. అప్పుడు కారులో రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. అయితే జడేజా మాత్రం మాస్క్‌ను ధరిచడం విశేషం. అయితే, ఆ సమయంలో, గుజరాత్‌లో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉంది. శుక్రవారం రాష్ట్రంలో 21 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అలాగే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
జడేజా క్రికెట్‌తో బిజీగా ఉన్నాడు జడేజా ప్రస్తుతం ఇంగ్లండ్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లాండ్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఐదవ టెస్ట్ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. జడేజా ఇంగ్లండ్ నుంచి నేరుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కి వెళతారు. అక్కడ చెన్నై సూపర్ కింగ్స్‌తో కలిసి ఐపీఎల్ -2021 రెండో దశలో పాల్గొంటాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌లలో ఆడే అవకాశం జడేజాకు లభించింది. ఐదో మ్యాచ్ రద్దు కావడానికి ముందు సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజలో ఉంది.
Also Read: Us Open 2021: మహిళల సింగిల్స్ విజేతగా కొత్త ఛాంపియన్.. ఫైనల్లో ఎమ్మా రదుకను అద్భుత విజయం
IPL 2021: సన్ రైజర్స్ ఇక గెలవడం కష్టమేనా..! జట్టుకు దూరమైన స్టార్ ఓపెనర్