IPL 2021: సన్ రైజర్స్ ఇక గెలవడం కష్టమేనా..! జట్టుకు దూరమైన స్టార్ ఓపెనర్
IPL 2021: భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపిఎల్ 2021 పడింది. సెప్టెంబర్ 19 నుంచి UAE లో
IPL 2021: భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపిఎల్ 2021 పడింది. సెప్టెంబర్ 19 నుంచి UAE లో ఐపీఎల్ మిగిలిన సీజన్ మళ్లీ ప్రారంభమవుతుంది. దీని కోసం అన్ని జట్లు యూఏఈ చేరుకుంటున్నాయి. టెస్ట్ సిరీస్‌లో భాగమైన ఇండియా, ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా 1-2 రోజుల్లో UAE కి చేరుకుంటారు. అయితే ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ ఐపీఎల్ ఆడటం లేదు.
ఇంగ్లీష్ మీడియా నివేదిక ప్రకారం.. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపిఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లలోఆడటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల టోర్నమెంట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు పెద్దు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బెయిర్‌స్టో సన్ రైజర్స్ జట్టులో భాగం. అతను ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ మొదటి కొన్ని మ్యాచ్‌లలో ఆడాడు. ప్రపంచ నంబర్ వన్ టీ 20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌ను ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది కానీ ఇప్పటివరకు అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
ఈ ముగ్గురు ఆటగాళ్లు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన్నారు. ఈ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌లలో బెయిర్‌స్టో తన ఉనికిని చాటుకున్నాడు. అంతేకాదు నాలుగో టెస్ట్ కోసం వికెట్ కీపర్ కూడా అయ్యాడు. అదే సమయంలో వోక్స్ ఒక సంవత్సరం తర్వాత టెస్ట్ జట్టుకు తిరిగి వచ్చాడు. నాలుగో టెస్టులో మాత్రమే పాల్గొన్నాడు. 3 సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన మలాన్ రెండు టెస్ట్ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. ఈ ముగ్గురి కంటే ముందుగానే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్ కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా స్టోక్స్, ఆర్చర్ టోర్నమెంట్‌కు దూరమయ్యారు, బట్లర్ తన రెండో బిడ్డ జన్మించిన కారణంగా ఐపిఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.